దెయ్యం.. ఇది ప్రతీ ఒక్కరికి ఉండే కామన్ భయం. నానాటి నుంచి దెయ్యాలపై ఎన్నో కథలు పుట్టుకొస్తున్నాయి. కొంతమంది అవి ఉన్నాయని నమ్మితే.. మరికొందరు అవన్నీ కల్పితాలని కొట్టిపారేస్తారు. ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ వాడకం పెరిగిపోవడం.. అంతేకాకుండా ప్రతీ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో దెయ్యాల కథలు కోకొల్లలు. ఇది కొంచెం పాత స్టోరీ అయినప్పటికీ.. మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం పదండి.!
2017వ సంవత్సరంలో లోయ్ లేన్ అనే యువతి అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌కు షిఫ్ట్ అయింది. తన సామాన్లతో పాటు కొత్త కొనుగోలు చేసిన 100 ఏళ్ల పురాతన ఓయిజా(Ouija) బోర్డును సైతం తీసుకెళ్లింది. సాధారణంగా ఈ రకం బోర్డులు ఏ ఇంట్లో ఉన్నా.. అక్కడ ఆత్మలు సంచరిస్తాయని అంటుంటారు. సరిగ్గా అదే జరిగింది.
కొత్త అపార్ట్‌మెంట్‌లో ఆమె ఎంటరైన మొదటి రోజు నుంచే విచిత్ర శబ్దాలు వస్తుండటం మొదలయ్యాయి. ప్రతీ రోజూ అర్ధరాత్రి విచిత్ర శబ్దాలు రావడమే కాకుండా, వింత అరుపులు, కర్టన్స్ దగ్గర నీడలు కనిపించడం మొదలయ్యాయి. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ సంఘటనలు మొదలైన దగ్గర నుంచి ఆ ఓయిజా బోర్డు అదృశ్యమైంది.
ఇదిలా ఉంటే ఒకానొక రోజు జరిగిన సంఘటనతో లోయ్ లేన్ మరింతగా భయపడింది. ఓ రోజు అర్ధరాత్రి బాత్రూమ్ నుంచి వింత శబ్దాలు రావడం లోయ్ లేన్ గుర్తించింది. అవేంటో తెలుసుకోవడానికి భయపడుతూనే అక్కడికి వెళ్లింది. బాత్రూమ్ తలుపు తీసి చూడగా.. వాటర్ టాప్ ఓపెన్ చేసి ఉంది. అక్కడంతా నీళ్లు నిండిపోయి ఉన్నాయి. అలాగే హెయిర్ డ్రయర్ ప్లగ్‌లో పెట్టి ఉండటం గమనించింది. ఇవన్నీంటితో భయపడిన లోయ్ లేన్.. ఆ అపార్ట్‌మెంట్ నుంచి మరో దానికి షిఫ్ట్ అయిపోయింది.
Read Also: ఒక్క వికెట్ కోసం తండ్లాట..! బ్యాట్స్‌మెన్‌ను చుట్టుముట్టిన ఫీల్డర్లు.. చివరికి గెలిచిందెవరు..?
హీరో కృష్ణుడు అరెస్ట్.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు
డయాబెటిస్‌కు చెక్ పెట్టే అద్భుత ఫలం.. ఈ పండులోని స్పెషాలిటీ ఏంటో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
మద్యం మత్తులో యువతి హల్‌చల్.. కిక్కు ఎక్కువై రోడ్డుపై ఏం చేసిందో మీరే చూడండి..