Trending Video: ఓ వ్యవహారంలో సస్పెండ్ అయిన పోలీసు ఇన్‌స్పెక్టర్ మళ్లీ విధుల్లో జాయిన్ అయ్యాడు. ఆ సంతోషంలో అతను చేసిన పని అతన్ని మళ్లీ సస్పెండ్ అయ్యేలా చేసింది. అతని సంతోషమే అతని పాటిన శత్రువుగా మారింది. ఈ ఘటన పాకిస్తాన్‌లో చోటు చేసుకుంది. ఇంతకీ అతను రెండుసార్లు సస్పెండ్ అవడానికి కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కరాచీలోని లికాయతాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న అబిద్ షా.. ఓ వ్యహారంలో మొదట సస్పెండ్ అయ్యాడు. కొద్ది రోజుల అనంతరం అబిద్ షా పై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేశారు. దాంతో అబిద్ షా తిరిగి విధుల్లోకి చేరారు. సస్పెన్షన్ ఎత్తివేసిన సంతోషంలో షా ఫ్రెండ్స్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో అబిద్ షా ఫుల్ ఎంజాయ్ చేశాడు. బాలీవుడ్ సినిమాలోని ఓ పాటకు స్టెప్పులు కూడా వేశాడు. అయితే, ఈ పార్టీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అదే అతని కొంప మరోసారి ముంచినట్లయ్యింది. ఈ వీడియో కాస్తా ఉన్నతాధికారుల కంట పడటంతో అబిద్ షా ను మరోసారి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో సస్పెన్షన్ ఎత్తివేసిన ఆనందం అబిద్ షాకు రోజులు కూడా లేకుండానే మరోసారి సస్పెన్షన్ షాక్ తగిలింది. గతంలోనూ అతని స్నేహితుల కారణంగా సస్పెన్షన్‌కు గురైన అబిద్ షా.. ఇప్పుడు కూడా అదే ఫ్రెండ్స్ కారణంగా సస్పెండ్ కావడం విశేషం.
కాగా, ఈ పాకిస్తా్న్ ఇన్‌స్పెక్టర్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తోంది. ఈ వీడియోలో షా తన స్నేహితులతో కలిసి బాలీవుడ్ సినిమాలోని ‘దిల్బార్, దిల్బార్, హోష్ నా ఖబర్ హై’ పాటకు డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. పాకిస్తాన్‌లో బాలీవుడ్ పాటకు చాలా పాపులారిటీ ఉంటుంది. ఆ కారణంగానే అక్కడ జరిగే వేడుకల్లో బాలీవుడ్ పాటలను ఎక్కువగా వింటుంటారు. ఇక పాకిస్తాన్‌కు చెందిన నటీ నటులు, గాయకులు కూడా బాలీవుడ్‌లో పని చేశారు.. చేస్తున్నారు.
Also read:
Beautiful Art: నాణేలతో అద్భుతమైన కళాకృతులు.. మీరు చూస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు..