Viral Video: పంచభక్ష పరమాన్నాలతో కోతికి భోజనం.. ఏం యోగమొచ్చిందంటూ నెటిజన్ల కామెంట్స్.. వీడియో వైరల్..

|

Jun 12, 2021 | 5:46 AM

Viral Video: కోతి ఎంత అల్లరిదో మన అందరికీ తెలిసిందే. కోచి చేసే పనులు మనం స్వయంగా ఎన్నో సందర్భాల్లో చూసి ఉంటారు.

Viral Video: పంచభక్ష పరమాన్నాలతో కోతికి భోజనం.. ఏం యోగమొచ్చిందంటూ నెటిజన్ల కామెంట్స్.. వీడియో వైరల్..
Monkey
Follow us on

Viral Video: కోతి ఎంత అల్లరిదో మన అందరికీ తెలిసిందే. కోచి చేసే పనులు మనం స్వయంగా ఎన్నో సందర్భాల్లో చూసి ఉంటారు. సోషల్ మీడియాలో కోతి చేష్టలకు సంబంధించిన వీడియోలో కోకొల్లలుగా వైరల్ అవుతాయి. తాజాగా కొతికి సంబంధించిన అలాంటి ఒక ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది. టెర్రస్ మీద కూర్చుని బుద్ధిగా అన్నం తింటున్న ఓ కొతిని కొందరు వీడియో తీసి ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేశారు. దాంతో ఆ వీడియో కాస్తా ప్రస్తుతం వైరల్‌గా మారింది. అయితే, ఈ కోతి వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. కొందరు వ్యక్తులు తమ ఇంటికి అతిథిగా వచ్చిన కోతికి అరటి ఆకులో పంచభక్త పరమాన్నాలతో కూడిన ఆహారాన్ని ఏర్పాటు చేశారు. అది చూసిన కోతి బుద్ధిగా ఓ వైపు కూర్చుని విస్తరాకు ముందు కూర్చొంది. అందులో ఆహారాన్ని తినేసింది. అయితే, కోతి భోజనం చేస్తుండగా.. అక్కడే ఉన్న వ్యక్తులు వీడియో తీశారు. అనంతరం ఆ వీడియోను ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేశారు. అలా పోస్ట్ చేయడం ఆలస్యం.. నెటిజన్ల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. పంచభక్త పరమాన్నాన్ని ఆస్వాధిస్తోందంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు. మరికొందరు.. కొతి తినే ఆహారం చూస్తుంటే.. వివాహ విందు గుర్తొస్తుందంటూ లొట్టలు వేసుకుంటున్నారు. కోతిని పెళ్లిని ఆహ్వానించి వింధు పెట్టినట్లున్నారని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా ఈ వీడియోకు విపరీతైన వ్యూస్, లైక్స్ వస్తున్నారు. ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ వీడియోనూ మీరూ చూసేయండి.

Viral Video:

Also read:

Corona Effect: శరీరంలోకి ప్రవేశించిన కరోనాను అడ్డుకునేది ఆ జన్యువే.. బ్రిటన్ శాస్త్రవేత్తల పరిశోధనలో ఆసక్తికర విషయాలు..