New Business: కౌగిలింత.. ఈ పేరులోనే మాయ ఉంది. అదే కౌగిలించుకుంటే.. మనసులోని సాధకబాదలన్నీ పటాపంచల్. అవును.. ఎంతోమంది విషయాన్ని రూఢీగా చెప్తారు. ఒక్క కౌగిలింత.. మనసుకు ఎంతో ప్రశాంతతను కలిగిస్తుంది. మనసులోని బాధల నుంచి రిలాక్స్ అయ్యేలా చేస్తుంది. తెలుగు సినిమా శంకర్ దాదా ఎంబిబిఎస్ లో ఓ సన్నివేశంలో హగ్ ప్రాముఖ్యత ఎలాంటిదో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఆ సినిమాలో హాస్పిటల్‌లో పని చేస్తున్న అటెండర్ ఫ్లోర్ క్లీన్ చేస్తూ అందరిపై రుసరుసలాడుతుంటాడు. అదే సమయంలో చిరంజీవి అలా నడుచుకుంటూ వెళ్తుండగా.. ఆయనపై ఆగ్రహం ప్రదర్శిస్తాడు పెద్దాయన. కానీ చిరంజీవి మాత్రం ఆ పెద్దాయనను ఆప్యాయంగా కౌగిలించుకుని, థ్యాంక్స్ చెప్తాడు. దాంతో ఆ పెద్దాయన మనసులో కోపం అంతా పోయి.. సంతోషంగా కనిపిస్తాడు. అదీ హగ్ పవర్ మరి. ఎన్నో పరిశోధనల్లోనూ ఈ విషయం నిజం అని తెలిపారు. బాధలో ఉన్న వ్యక్తిని, కష్టాల్లో ఉన్న వ్యక్తిని సాధరంగా చేరది ఒక్కసారి కౌగిలించుకుంటే.. వారిలో నిస్తేజం దాదాపుగా తగ్గిపోతుందని చెప్పారు. కౌగిలింతకు ఉండే పవర్ అలాంటిదని చెబుతారు. కౌగిలింత పవర్ అలాంటిది కాబట్టే.. ఇప్పుడిది వ్యాపారంగా మారింది. కౌగిలించుకోండి.. డబ్బులు పే చేయండి అంటూ ఓ యువతి.. వింత బిజినెస్ట్ స్టార్ట్ చేసింది. మరి దీనికి సంబంధించి విశేషాలంటే ఇప్పుడు తెలుసుకుందాం.
అమెరికాలోకి చికాగోకి చెందిన కీలీ షౌప్ అనే మహిళ కౌగిలింతల వ్యాపారం మొదలు పెట్టింది. కౌగిలించుకున్నందుకు గంటకి 7,300 రూపాయాలు ఛార్జ్ చేస్తుంది. దీర్ఘకాల ఇబ్బందులు, మనో వ్యాధులతో బాధపడుతూ ఎంతో మంది తన వద్దకు వస్తారని, చాలా మందికి కనీసం తోడు కూడా లేని వారు ఉంటారని చెప్పింది. ఇలాంటి వారికే కౌగిలింత కాన్సెప్ట్ తీసుకువచ్చానని చెబుతోంది. తన వద్దకు వచ్చే కస్టమర్లకు.. కౌగిలింతతో పాటు.. వారితో సరదాగా ఉంటానని చెప్పుకొచ్చింది. చాలా మంది తమ పక్కన కూర్చోబెట్టుకుని ముచ్చటించడం.. సరదాగా గిల్లికజ్జాలు ఆడటం వంటివి చేస్తూ రిలాక్స్ అవుతారట. తన వద్దకు వచ్చే కస్టమర్లు చాలా వరకు తమ మనసులోని భారాన్ని తొలగించుకుని వెళ్తున్నారని సంతోషం వ్యక్తం చేసింది. అయితే కౌగిలించుకునే ఈ వ్యాపారం ఆలోచన సరైనదే అయినా.. ఆమే వద్దకు వచ్చే కొందరు కస్టమర్ల నుంచి పెద్ద తలనొప్పులు ఎదురవుతున్నట్లు చెబుతోంది. కానీ కీలీ మాత్రం ఈ బిజినెస్‌లో కస్టమర్ల పట్ల చాలా స్ట్రిక్ట్‌గా ఉంటోంది. చాలా మంది ఆమెను శృంగారంలో పాల్గొనాలంటూ ఒత్తిడి చేస్తుంటారట. అయితే, కీలీ మాత్రం కరాఖండిగా చెప్పేసిందట. మొత్తానికి ఈ బిజినెస్ బాగా నడుస్తుందట. అయితే, ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన బాధాకరమైన విషయం ఏంటంటే.. హీరో కళ్యాన్ రామ్ సినిమాలో చెప్పినట్లుగా చివరికి అనుబంధాలు, ఆప్యాయతలు కూడా డబ్బులు పెట్టిన కొనుక్కోవాల్సిన దుస్థితి రావడం.
Also read: