Heartwarming Video: జంతువులకు సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం సర్క్యూలేట్ అవుతూనే ఉంటాయి. తాజాగా మనసుకు హత్తుకునే, వావ్ అనిపించే వీడియో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఆ వీడియోలో కుక్క చేసిన పనిని మెచ్చుకోవడమే కాకుండా.. దానికి సూపర్ హీరో అని బిరుదు కూడా ఇచ్చేస్తున్నారు.
మనుషుల మధ్య, మనుషులతో సమానంగా పెరిగే పెంపుడు కుక్కలకు సాధారణంగానే అపారమైన తెలివి తేటలు ఉంటాయి. ఎదుటి ప్రాణికి అపాయం ఉందంటే చాలా కుక్కలు వెంటనే స్పందించి వాటిని రక్షించిన సందర్భాలు కోకొల్లలు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. నీటిలో కొట్టుకుపోతున్న ఓ అడవి జంతువును.. ఓ పెంపుడు కుక్క రక్షించి ఒడ్డుకు చేర్చింది. ఈ ఘటనను అంతా వీడియో తీసినిన కుక్క యజమాని.. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దాంతో ఆ వీడియో కాస్తా తెగ వైరల్ అయ్యింది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు కుక్కపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
రోల్ఫ్ అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన ఆ వీడియోలో ఏముందంటే.. రోల్ఫ్ తన పెంపుడు కుక్క హార్లే కనిపించకపోవడం ఒక్కసారి ఆందోళనకు గురై వెతకడం ప్రారంభించాడు. అంతలో ఇంటి అవతలివైపున ఉన్న సరస్సు వైపు చూగా.. సరస్సులో ఈదుతూ హార్లే కనిపించింది. దాంతో రోల్ఫ్ షాక్ అయ్యాడు. అసలేం జరిగిందని హార్లే సమీపించగా.. షాకింగ్ సీన్ కనిపించింది. రోల్ఫ్ వెంటనే తన సెల్‌ఫోన్‌ను తీసి వీడియో తీయడం ప్రారంభించాడు.
సరస్సులో జింక పిల్ల కొట్టుకుపోవడాన్ని హార్లే(కుక్క) గమనించింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా హార్లే కూడా నీటిలోకి దూకింది. నీటిలో మునిగిపోతున్న జింక పిల్లలను సమీపించిన హార్లే.. దానిని కాపాడింది. సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చింది. ఒడ్డుకు వచ్చిన జింక పిల్ల.. కుక్కకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లుగా చాలా స్నేహంగా మెలిగింది. హార్లే, జింక పిల్ల సరదాగా కాసేపు ఆడుకున్నాయి. ఆ తరువాత జింక పిల్ల అడవిలోకి వెళ్లిపోయింది. కాగా, ఈ దీన్నంతటినీ వీడియో తీసిని రోల్ఫ్.. ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. రోల్ఫ్ అలా పోస్ట్ చేయడమే ఆలస్యంగా నెటిజన్ల నుంచి ఊహించని రీతిలో స్పందన వచ్చింది. హార్లేను పొగుడుతూ ఎన్నో కామెంట్స్ పెట్టారు. రెండు లక్షలకు పైగా లైక్స్‌లు, లక్షకు పైగా షేర్స్ వచ్చాయి.
Viral Video:
Also read:
కాసేపట్లో పెళ్లి.. పోలీసుల రాకతో సీన్ రివర్స్.. చివరకు వరుడి తమ్ముడినే పెళ్లాడిన వధువు.. ఎక్కడంటే..