Viral Video: ప్రకృతిలో వింతలు, విశేషాలకు కొదవ లేదు. అనునిత్యం ఎక్కడోచోట ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంటూనే ఉంటుంది. ఇక అడవుల్లో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అడవి జంతువుల జీవితం నిత్యం జీవన్మరణ పోరాటమే అని చెప్పాలి. కొన్ని జంతువులు అడవి ఫలాలు, చెట్లను తిని జీవిస్తే.. మరొకొన్ని క్రూర మృగాలు జంతువులనే తిని జీవిస్తాయి. అలా నిత్యం ఎదురయ్యే ప్రమాదాలను దాటుకుంటూ ప్రతీ జంతువు జీవిత పోరాటం చేయాల్సిందే. ఇదింతా ఇలా ఉంటే.. తాజాగా చిరుత పులికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సురేందర్ మెహ్రా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియోలో ఎముందో ఇప్పుడు తెలుసుకుదాం. ఆ వీడియో క్లిప్‌లో దాహార్తితో ఉన్న ఓ చిరుత పులి నీరు తాగేందుకు.. గడ్డి మొక్కలతో నిండి ఉన్న ఒక కొలను వద్దుకు వచ్చింది. భయపడుతూనే అడుగులు ముందుకు వేసిన చిరుత.. అదే భయంతో బిక్కు బిక్కుమంటూ నీటిని తాగింది. అయితే, చిరుత రాకను గమనించి నీటి అడుగులో మాటు వేసిన మొసలి.. అదును చూసి చిరుతపై అటాక్ చేసింది. అయితే మొదటి నుంచి అలర్ట్‌గా చిరుత ఒక్క ఉదుటున పైకి ఎగిరింది. మొసలికి చిక్కకుండా పరుగు లంకించుకుంది. కొంచెం తేడా అయినా చిరుత పులి.. నీటిలోని మొసలికి ఆహారంగా మారేది. అదృష్టం కొద్ది అది బ్రతికిపోయింది. అయితే, ఈ వీడియోను ఫారెస్ట్ ఆఫీసర్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇప్పుడది వైరల్‌గా మారింది. 14 సెకన్ల ఈ వీడియోకు సెకన్ల వ్యవధిలోనే వేలల్లో వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమకు తోచినట్లుగా స్పందిస్తున్నారు.
Viral Video:
Wilderness is full of uncertainties and surprises..
‘Survival of fittest..’ #Wilderness @susantananda3 pic.twitter.com/yFfDggi3a1— Surender Mehra IFS (@surenmehra) May 29, 2021
Also read: