ఆ ఇద్దరూ ఎప్పుడు కలుసుకున్నా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మీడిమా సంస్థలన్నీ తమ కెమెరాలను వారివైపే ఫోకస్ చేస్తాయి. ఏంటీ అంత స్పెషల్ అనుకుంటున్నారా? ప్రపంచంలోనే అత్యంత పొడవైన అబ్బాయి.. అత్యంత పొట్టి అమ్మాయి మీరే మరి. ఇద్దరూ ఒకచోట చేరితే అందరి కళ్లూ వారిపైనే ఉంటాయి. ఇతడి పేరు సుల్తాన్ కోసెన్.. వయసు 41 ఏళ్లు. టర్కీకి చెందిన సుల్తాన్ కోసెన్ పొడవు ఏకంగా 8 అడుగుల 3 అంగుళాలు. మరి ఈమె పేరు జ్యోతి ఆమ్గే.. వయసు 30 ఏళ్లు. ఇండియాకు చెందిన ఈమె పొడవు కేవలం 2 అడుగులే. వీరిద్దరూ ఆరేళ్ల క్రితం మొదటిసారి ఈజిప్ట్‌లో ఫొటో షూట్ కోసం కలుసుకున్నారు. అప్పటి ఫొటోలు ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించాయి. తాజా అమెరికాలో మరో ఫొటో షూట్ కోసం మళ్లీ కలుసుకున్నారు. వీరిద్దరూ కలిసి సోమవారం కాలఫోర్నియాలో బ్రేక్‌ఫాస్ట్ చేశారు. కాలఫోర్నియా సుల్తాన్ కోసెన్, జ్యోతి ఆమ్గే ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో కోసెన్ షూ కంటే జ్యోతి కొంచెం పొడవుగా కనిపించింది.
వీరి ఫొటోలను టర్కీకి చెందిన అనడోలు వార్తా సంస్థ విడుదల చేసింది. గుర్తు తెలియని వ్యక్తి ఆహ్వానం మేరకు ఈ జంట లాస్ ఏంజిల్స్‌కు వెళ్లినట్లు అనడోలు వార్తా సంస్థ వెల్లడించింది. అకొండ్రోప్లాసియాగా పిలిచే లోపం వల్ల జ్యోతి ఎదుగుదల లేక మరుగుజ్జులా ఉండిపోయింది. ఇక పిట్యుటరీ గ్రంథిలో ట్యూమర్ వల్ల గ్రోత్ హార్మోన్ విపరీతంగా ఉత్పత్తయి కోసెన్ భారీగా ఎదిగిపోయాడు. అన్నట్టు వీరిద్దరికీ గిన్నీస్ రికార్డులో కూడా చోటు దక్కింది.పిట్యూటరీ జిగాంటిజం అనే అరుదైన వ్యాధి వల్ల ఎముకలు, ఇతర శరీర భాగాలు సాధారనం కంటే వేగంగా పెరుగుతాయి.
కోసెన్-జ్యోతి చివరిసారిగా 2018లో ఈజిప్ట్‌ని సందర్శించినప్పుడు గ్రేట్ సింహిక ఆఫ్ గిజా వద్ద ఫొటోలకు పోజులిచ్చారు. సింహిక గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో కూడా ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా విగ్రహం. కోసెన్ 2009లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వ్యక్తిగా గిన్నీస్ రికార్డ్‌లో కెక్కాడు. అప్పుడు 20 ఏళ్లలో 8 అడుగులకు పైగా పొడవు పెరిగిన మొదటి వ్యక్తిగా గిన్సీస్ సంస్థ ప్రకటించింది. అంతేకాకుండా ప్రపంచంలోనే అతి పెద్ద హ్యాండ్‌గా కూడా రికార్డు సృష్టించాడు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.