ఒక్కోసారి రియల్ హీరోలు మన కళ్ళ ముందే కనిపిస్తుంటారు. వారి సమయ స్ఫూర్తి, ధైర్య సాహసాలకు విలువ కట్టలేం.. ముంబై డివిజన్ లోని సెంట్రల్ రైల్వేలో పని చేసే మయూర్ షేక్ అనే ఉద్యోగి (పాయింట్స్ మన్) విషయానికే వద్దాం.. ఈ నెల 17 న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ముంబైలోని వంగానీ రైల్వే స్టేషన్ లో జరిగింది ఓ ఘటన.. ఈ స్టేషన్ లో ఓ మహిళ తన చిన్నారితో కలిసి ప్లాట్ ఫామ్ పై నడుస్తుండగా ఆ బాలుడు కాలు జారీ కింద రైల్వే ట్రాక్ పై పడిపోయాడు. అప్పటికే శరవేగంగా ఓ సబర్బన్ రైలు వస్తోంది. ఇది చూసిన మయూర్ షేక్ పరుగున పరుగున వచ్చి ఆ బాలుడిని ప్లాట్ ఫామ్ పైకి విసిరివేసినంత పని చేశాడు. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ చిన్నారిని రక్షించాడు. అతడు ఏమాత్రం ఇలా సమయస్ఫూర్తి చూపకపోయినా ఆ చిన్నారి రైలు కింద పడి ప్రాణాలు కోల్పోయేవాడే.. ఈ ఘటన అంతా సీసీటీవీ ఫుటేజీలో రికార్డాయింది. మయూర్ షేక్ ధైర్య సాహసాలను, డ్యూటీ పట్ల అతని అంకిత భావాన్ని రైల్వే శాఖ అధికారులు ప్రశంసలతో ముంచెత్తారు.
A Good Samaritan:
At Vangani station of Central Railway, Pointsman Mr. Mayur Shelkhe saved the life of a child just in the nick of the time. He risked his life to save the life of the child.
We salute his exemplary courage & utmost devotion to the duty. pic.twitter.com/V6QrxFIIY0
— Ministry of Railways (@RailMinIndia) April 19, 2021