Pig Heart Transplantation: మనిషికి పంది గుండె అమర్చిన వైద్యులు.. రెండు రోజుల్లోనే కోలుకున్న రోగి

|

Sep 24, 2023 | 10:15 AM

పంది గుండెను మనిషికి విజయవంతంగా అమర్చారు అమెరికా వైద్యులు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ రోగికి పంది గుండె అమర్చారు. అమెరికాలోని మేరీలాండ్‌లో డాక్టర్లు పంది గుండె అమర్చి అతన్ని ప్రాణం నుంచి కాపాడారు. ఇలాంటి అరుదైన చికిత్స జరగడం అమెరికాలో ఇది రెండోసారి కావడం విశేషం. బాధితుడు లారెన్స్‌ ఫాసెట్‌ నావికాదళంలో పనిచేసి పదవీ విరమణ పొందాడు. 58 ఏళ్ల వయసున్న లారెన్‌ ఫాసెట్‌ గుండె వైఫల్యంతో బాధపడుతున్నాడు. దీంతో అతను మరణానికి..

Pig Heart Transplantation: మనిషికి పంది గుండె అమర్చిన వైద్యులు.. రెండు రోజుల్లోనే కోలుకున్న రోగి
Pig Heart Transplantation
Follow us on

వాషింగ్టన్‌, సెప్టెంబర్‌ 24: పంది గుండెను మనిషికి విజయవంతంగా అమర్చారు అమెరికా వైద్యులు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ రోగికి పంది గుండె అమర్చారు. అమెరికాలోని మేరీలాండ్‌లో డాక్టర్లు పంది గుండె అమర్చి అతన్ని ప్రాణం నుంచి కాపాడారు. ఇలాంటి అరుదైన చికిత్స జరగడం అమెరికాలో ఇది రెండోసారి కావడం విశేషం. బాధితుడు లారెన్స్‌ ఫాసెట్‌ నావికాదళంలో పనిచేసి పదవీ విరమణ పొందాడు. 58 ఏళ్ల వయసున్న లారెన్‌ ఫాసెట్‌ గుండె వైఫల్యంతో బాధపడుతున్నాడు. దీంతో అతను మరణానికి చేరువయ్యాడు. అంతేకాకుండా ఇతర వ్యాధులు కూడా ఉండటంతో సంప్రదాయ గుండె మార్పిడికి అవకాశం లేకుండాపోయింది. సంప్రదాయ పద్ధతిలో గుండె మార్పిడి కుదరకపోవడం వల్లనే అతనికి పంది గుండెను అమర్చేందుకు వైద్యులు సిద్ధమయ్యారు.

దీంతో అమెరికాలోని ‘యూనివర్సిటీ ఆఫ్‌ మేరీలాండ్‌ మెడిసిన్‌’ డాక్టర్లు క్లిష్టమైన ప్రయోగానికి సిద్ధమమయ్యారు. జంతువు గుండె మనిషికి అమర్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు ఇటీవల లారెన్స్‌ ఫాసెట్‌కు వైద్యులు పంది గుండెను అమర్చారు. ఈ చికిత్స విజయవంతమవడంతో రోగి ప్రాణాలు కాపాడినట్లైంది. అపరేషన్‌ నిర్వహించిన రెండు రోజుల విశ్రాంతి తర్వాత అతడు చలోక్తులు విసురుతూ ఎంతో ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా ‘యూనివర్సిటీ ఆఫ్‌ మేరీలాండ్‌ మెడిసిన్‌’ వైద్యులు గతంలోనూ మనిషికి పంది గుండెను అమర్చారు. గత ఏడాది డేవిట్‌ బెనెట్‌ అనే వ్యక్తికి ప్రపంచంలోనే తొలిసారిగా జన్యుపరంగా మార్పిడి చేసిన పంది గుండెను అమర్చారు. కానీ చికిత్స జరిగిన తర్వాత అతను కేవలం రెండు నెలలు మాత్రమే జీవించగలిగాడు. తాజాగా మరోమారు లారెన్స్‌ ఫాసెట్‌కు పంది గుండెను అమర్చి అబ్బురపరిచారు. అయితే గతంలో పంది గుండె అమర్చిన వ్యక్తి రెండు నెలల్లోనే చనిపోయాడన్న విషయం తెలిసి కూడా లారెన్స్‌ ఫాసెట్‌ ఈ ప్రయోగానికి సిద్ధపడ్డాడు.

అనారోగ్య కారణాలు, హార్ట్‌ ఫెయిల్యూర్‌ కారణంగా మరణం ముప్పును ఎదుర్కొంటున్న ఆయనకు చివరి ప్రయత్నంగా వైద్యులు ఈ ఆపరేషన్‌ నిర్వహించినట్లు తెలిపారు. జన్యుమార్పిడి చేసిన పంది గుండెను వైద్యులు అతనికి అమర్చారు. కుర్చీలోనూ కూర్చోగలిగాడని తెలిపారు. ఈ ప్రయోగంలో రానున్న కొన్ని వారాలు అత్యంత క్లిష్టమైనవని, ఆయన ప్రస్తుతం స్పందిస్తున్న తీరు ఆశ్చర్యానికి కలిగిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఇక ఆపరేషన్‌ తర్వాత తాను నిండు నూరేళ్లు జీవిస్తానని లారెన్స్‌ ఫాసెట్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా అమెరికాలో హ్యూమన్‌ ఆర్గాన్స్‌ కొరత తీవ్రంగా ఉంది. ఆ దేశంలో గత ఏడాది కేవలం 4,100 గుండె మార్చిడి చికిత్సలు మాత్రమే చేశారు. గుండెతోపాటు ఇతర అవయవాల కోసం పెద్ద సంఖ్యలో బాధితులు ఎదురు చూస్తున్నట్లు అక్కడి వైద్యులు చెబుతున్నారు. ఏదిఏమైనా జంతువుల అవయవాలు మనుషులకు అమర్చడం, అవి సవ్యంగా పని చేయడం జరిగితే ఈ ప్రయోగం వైద్య చరిత్రలోనే కీలక మైలురాయిగా నిలవనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.