Doctors Remove Glass in Stomach: ఓ విచిత్రమైన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన వ్యక్తిని పరిశీలించిన వైద్యులు ఒక్కసారిగా షాకయ్యారు. అతని కడుపులో గ్లాసును (Glass).. గుర్తించి ఆపరేషన్ చేసి బయటకు తీశారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 55 ఏళ్ల వ్యక్తికి ఆదివారం బీహార్ (Bihar) లోని ముజఫర్‌పూర్ మాదిపూర్ లోని ఓ ఆసుపత్రి వైద్యుల బృందం శస్త్రచికిత్స చేసి.. అతని పెద్దప్రేగు నుండి గాజుగ్లాసును వెలికితీసింది. ఈ కేసు గురించి.. డాక్టర్ మఖ్దులుల్ హక్ మాట్లాడుతూ.. ఎండోస్కోపిక్ ద్వారా గ్లాస్‌ను బయటకు తీసేందుకు ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయిందన్నారు. దీంతో ఆపరేషన్ చేసి గ్లాసును బయటకు తీశామన్నారు. అసలు గ్లాస్ ఆ వ్యక్తి కడుపులోకి ఎలా వెళ్లింది అనేది ప్రశ్నగా మారిందని.. దీనిగురించి బాధితుడు క్లారిటీగా చెప్పడం లేదన్నారు. టీ తాగేటప్పుడు తాను గ్లాస్ మింగేశానని బాధితుడు చెబుతున్నాడని.. ఆహారనాళంలో గ్లాస్ పట్టదని, మలద్వారం నుంచే వెళ్లి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. బాధితుడు వైశాలి జిల్లాలోని మహువాకు చెందినవాడని పేర్కొన్నారు.
బాధితుడు తీవ్రమైన మలబద్ధకం, కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరాడు. అతనికి నిర్వహించిన అల్ట్రాసౌండ్, ఎక్స్-రే పరీక్షల్లో అతని ప్రేగులలో ఏదో ఉన్నట్లు తేలింది. పరిశీలించగా.. గాజు గ్లాసుగా నిర్దారించారు. ఎండోస్కోపిక్ ప్రక్రియ ద్వారా పురీషనాళం నుంచి గాజును బయటకు తీయడానికి మొదట ప్రయత్నించామని డాక్టర్ చెప్పారు. కానీ అది ఫలించలేదని.. ఆ తర్వాత ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.
Also Read: