పెళ్లి రోజు కానుకగా భార్యకు అతి పెద్ద బంగారు నెక్లెస్.. అసలు విషయం తెలుసుకొని షాకైన పోలీసులు.. ఎక్కడంటే..

| Edited By: Team Veegam

May 24, 2021 | 12:41 PM

పెళ్లి రోజు కానుకగా తమ భార్యలకు ప్రత్యేకంగా ఏదైన వస్తువు ఇవ్వాలనుకుంటారు చాలా మంది. చీరలు, నగలు, గాజులు ఇలా ఏదో ఓక వస్తువు ఇవ్వాలని ఆలోచిస్తుంటారు.

పెళ్లి రోజు కానుకగా భార్యకు అతి పెద్ద బంగారు నెక్లెస్.. అసలు విషయం తెలుసుకొని షాకైన పోలీసులు.. ఎక్కడంటే..
Viral Video
Follow us on

పెళ్లి రోజు కానుకగా తమ భార్యలకు ప్రత్యేకంగా ఏదైన వస్తువు ఇవ్వాలనుకుంటారు చాలా మంది. చీరలు, నగలు, గాజులు ఇలా ఏదో ఓక వస్తువు ఇవ్వాలని ఆలోచిస్తుంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం కాస్త విభిన్నంగా ఆలోచించాడు. పెళ్లి రోజు కానుకగా పెద్ద బంగారు నెక్లెస్ ఇచ్చాడు. ఇక ఆ మహిళ ఆ నెక్లెస్ ధరించన తర్వాత మైక్ లో పాట పాడుతూ.. సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఈ విషయం పోలీసుల వరకు వెళ్లింది. ఇంకేముందు ఆ ఫోటోలు చూసిన పోలీసులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. వెంటనే అతడిని విచారణ కోసం స్టేషన్ కు తీసుకెళ్లారు.

ఇక స్టేషన్‏కు తీసుకువచ్చిన తర్వాత ఆ వ్యక్తి చెప్పిన విషయాలను పోలీసులకు ఖంగుతిన్నారు. తాను ఆ హారం బంగారంతో చేయలేదని.. నకిలీదని చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు. తాను చాలా కాలం క్రితమే ఆ నెక్లెస్ ను రూ. 38,000 లకు తీసుకున్నాడని.. పెళ్లి రోజు సందర్భంగా తన భార్య ముచ్చటపడి మరీ ఆ నెక్లెస్ ధరించిందని చెప్పాడు. జువెల్లరీ వ్యాపారులతో కూడా తాము ఆ నగ గురించి మాట్లాడామని అది నకిలీదని.. బంగారంతో చేయలేదని సీనియర్ సీఐ కొంగావ్ పోలీసు గణపత్ పింగిల్ అన్నారు. కేవలం భద్రత కారణంగానే అతడిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళినట్లుగా చెప్పారు.

Also Read: సినీ జీవితం చాలా నేర్పించింది… నమ్మకద్రోహులకు దూరంగా ఉండటమే కాదు.. ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి.. చంద్రమోహన్..

Karthika Deepam: దీప కోసం మొదటి సారి ఏడ్చిన కార్తీక్.. అందుకు మా అమ్మ సంతోషంగా ఉంది.. కార్తీక దీపంపై మంచు లక్ష్మీ ఆసక్తికర ట్వీట్..

Heroine Radhika Apte : ఒక్క సినిమాకు నాతో డబుల్ వర్క్ చేయించారు.. సంచలన కామెంట్లు చేసిన హీరోయిన్..

లక్కీ ఛాన్స్ అందుకున్న బాలీవుడ్ హీరోయిన్.. హాలీవుడ్‏ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్.. పవర్‏ఫుల్ పాత్రలో బ్యూటీ..