బిగ్ బ్రేకింగ్: చంద్రబాబు ఇంటిని కూల్చేందుకు నోటీసులు

Notices to demolish AP Former CM Chandrababu's house, బిగ్ బ్రేకింగ్: చంద్రబాబు ఇంటిని కూల్చేందుకు నోటీసులు

వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఏపీ సీఎంగా.. అధికారం చేపట్టినుంచీ.. అక్రమకట్టడాలపై సీరియస్‌గా ఉన్నారు. ఈ నేపథ్యంలో.. అక్రమ కట్టడంగా భావించిన ‘ప్రజావేదిక’ను కూల్చివేశారు. అలాగే.. చంద్రబాబు ఇంటిపై కూడా గత కొన్ని రోజులుగా.. రచ్చ జరుగుతోంది. ఈ సందర్భంలో.. మరోసారి చంద్రబాబు ఇంటికి సీర్డీఏ నోటీసులు పంపించింది.

కరకట్ట వివాదం మరో మలుపు తిరిగింది. ఉండవల్లిలోని కృష్ణానది కరకట్టపై ఉన్న మాజీ సీఎం చంద్రబాబు ఇంటికి సీఆర్డీఏ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. నోటీసులు ఇంటి ముందు అంటించారు అధికారులు. గతంలో.. ఇచ్చిన షోకాజ్ నోటీసులకు లింగమనేని రమేష్ నుంచి ఎలాంటి వివరణ లేదు. వారం రోజులలోగా సమాధానం ఇవ్వకుంటే.. చంద్రబాబు నివాసాన్ని కూల్చివేయాలంటూ తెలిపారు అధికారులు. స్విమ్మింగ్ ఫూల్, లివింగ్ రూమ్ వంటివి అనుమతులకు వ్యతిరేకంగా నిర్మించారని నోటీసులో ఉంది. ముందు ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇవ్వనందుకే.. ఈ నోటీసులు ఇచ్చినట్టు అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *