ఏపీలో విద్యుత్ కోతలు లేవు: మంత్రి సుచరిత

No power cuts in AP said Minister M Sucharita, ఏపీలో విద్యుత్ కోతలు లేవు: మంత్రి సుచరిత

రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉన్నాయంటూ ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని ఏపీ హో మంత్రి సుచరిత అన్నారు. గుంటూరులో విద్యుత్ శాఖాధికారులతో ఆమె విద్యుత్ సరఫరా వివరాలను వెల్లడించారు. వ్యవసాయానికి 9 గంటలు, గృహ అవసరాలకు 24 గంటలపాటు విద్యుత్ సరఫరా చేస్తున్నట్టుగా పేర్కొన్నారు. అయితే వర్షాలతో చెట్లు కూలిపోవడం, విద్యుత్ తీగలు తెగిపోవడం వంటి సమస్యలతో అంతరాయం ఏర్పడే అవకాశాలు సర్వసాధారణమేనన్నారు. అదే విధంగా ఎస్సీ,ఎస్టీ లబ్దిదారులకు 200 యూనిట్లలోపు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *