వాహనదారులకు ఊరట.. చలాన్ల ఫైన్లు తగ్గించుకోవచ్చన్న గడ్కరీ

New Vehicle Act Updates, వాహనదారులకు ఊరట.. చలాన్ల ఫైన్లు తగ్గించుకోవచ్చన్న గడ్కరీ

కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన మోటార్ వెహికిల్ చట్టం వల్ల వాహనదారులపై భారీ జరిమానాలు పడుతున్నాయి. రహణా అధికారులు, ట్రాఫిక్ పోలీసులు ఇష్టం వచ్చినట్లు చలాన్లు బాదుతున్నారు. దీంతో ప్రజల్లో తీవ్ర అసహనం వెలువడుతోంది. దీంతో పలు రాష్ట్రాలు కొత్త మోటార్ వెహికిల్ యాక్ట్ పెనాల్టీలను అమలుపరిచేందుకు అనాసక్తి చూపుతున్నారు. ఇప్పటికే గుజరాత్ ప్రభుత్వం చలాన్ల ధరలను సగానికి తగ్గించింది. ఇక గుజరాత్ రాష్ట్రం మాదిరిగా కర్ణాటకలో కూడా చలాన్లను తగ్గించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే సీఎం యడియూరప్ప ఈ విషయంపై రవాణాశాఖ అధికారులతో చర్చించారు.

గుజరాత్‌లో ట్రాఫిక్ చలాన్లు ఈ విధంగా ఉన్నాయి. కేంద్రం తెచ్చిన నూతన చట్టం ప్రకారం హెల్మెట్, సీటు బెల్ట్ పెట్టుకోకపోతే..  వెయ్యి రూపాయల పెనాల్టీ విధిస్తోంది. అయితే గుజరాత్‌లో ఈ చలాన్‌ ధరను రూ. 500/-, సీట్ బెల్టు పెట్టుకోకపోతే రూ. 500/- రూపాయలకు తగ్గించారు. ఇక త్రిబుల్ రైడింగ్‌కు కేంద్రం రూ.1000/- జరిమానా విధిస్తుండగా.. గుజరాత్ ప్రభుత్వం 100/- రూపాయలు మాత్రమే విధించేందుకు సిద్ధమైంది. అయితే ఇదే తరహాలో కర్ణాటకలోనూ అమలు చేయాలని సీఎం యడియూరప్ప నిర్ణయించారు.

మరోవైపు కొత్త వెహికిల్ చట్టంపై ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. ఈ చట్టంలో మార్పులు చేసింది కేంద్రానికి ఆదాయం తీసుకురావడానికి కాదని.. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించకుండా ఉండటానికేనని ఆయన చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికిి ఫైన్లు ఎంత విధించాలో ఆరాష్ట్రాలకే వదిలేస్తున్నామని గడ్కరీ పేర్కొన్నారు. గుజరాత్, కర్ణాటక మాదిరిగా ఇతర రాష్ట్రాలు కూడా ట్రాఫిక్ జరిమానాలు తగ్గించుకోవచ్చని ఆయన ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *