లేటు వయసు ఘాటు కోరిక.. తల్లైతే తప్పేంటి ?

గతంలో 40ఏళ్ళ తర్వాత పిల్లల్ని కనాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించే వారు. తల్లీ, పిల్లా ఆరోగ్యంతోపాటు ఇతర సామాజికాంశాలు కూడా పరిగణనలోకి తీసుకుని మరీ నిర్ణయం తీసుకునేవారు. కానీ ఇపుడు పరిస్థితి మారుతోంది. ముదిమి వయసులోని పిల్లల్ని కనేందుకు మొగ్గు చూపుతున్నారు పలువురు. ఈ తరహా ఉదంతాలు తెలుగు నేలపై జోరందుకున్నాయి. ఇటీవల గుంటూరులో 72 ఏళ్ళ మంగాయమ్మ ఇద్దరు కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇదే తరహాలో రాజస్థాన్‌లో ఓ 75ఏళ్ళ వృద్ధ మహిళ […]

లేటు వయసు ఘాటు కోరిక.. తల్లైతే తప్పేంటి ?
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 17, 2019 | 4:49 PM

గతంలో 40ఏళ్ళ తర్వాత పిల్లల్ని కనాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించే వారు. తల్లీ, పిల్లా ఆరోగ్యంతోపాటు ఇతర సామాజికాంశాలు కూడా పరిగణనలోకి తీసుకుని మరీ నిర్ణయం తీసుకునేవారు. కానీ ఇపుడు పరిస్థితి మారుతోంది. ముదిమి వయసులోని పిల్లల్ని కనేందుకు మొగ్గు చూపుతున్నారు పలువురు. ఈ తరహా ఉదంతాలు తెలుగు నేలపై జోరందుకున్నాయి. ఇటీవల గుంటూరులో 72 ఏళ్ళ మంగాయమ్మ ఇద్దరు కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇదే తరహాలో రాజస్థాన్‌లో ఓ 75ఏళ్ళ వృద్ధ మహిళ కూడా ఇటీవల తల్లైంది.

ఇలా  వయసు మీద పడి పిల్లలు కావాలనుకునే వారికి… సంతాన సాఫల్య కేంద్రాలు వరంగా మారుతున్నాయి. 70 ఏళ్లు దాటిన వారు కూడా పిల్లలకు జన్మనిస్తున్నారు. అయితే అలా జన్మించిన వారి ఆరోగ్యం భవిష్యత్‌లో ఎలా ఉంటుంది? ఆ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారా? అసలు 50 ఏళ్లు దాటిన తర్వాత పిల్లల్ని కనొచ్చా? ఇదిప్పుడు జవాబు లేని ప్రశ్న. ఎందుకంటే ఈ ప్రశ్నకు రెండు రకాల సమాధానాలు వినిపిస్తున్నాయి.

తూర్పుగోదావరి జిల్లా నెలవర్తిపాడుకు చెందిన మంగాయమ్మ, రామారావు దంపతులకు 57 ఏళ్ల క్రితం వివాహం జరిగినా సంతానం లేదు. దీంతో సంతాన సాఫల్య కేంద్రాన్ని ఆశ్రయించడంతో మంగాయమ్మ ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. గుంటూరులోని అహల్య నర్సింగ్‌ హోమ్‌లో ఐవీఎఫ్‌ పద్దతిలో మంగాయమ్మ ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. 72 ఏళ్ల మంగాయమ్మకు తొమ్మిది నెలల తర్వాత డెలివరీ చేశారు వైద్యులు. ఆమెకు బీపీ, షుగర్‌ లేకపోవడంతో వైద్యులు సంతాన సాఫల్య చికిత్స చేశారు.

ఇటు భద్రాచలానికి చెందిన ఉమ, సత్యనారాయణ దంపతులకు కూడా సంతాన సాఫల్య కేంద్రం ద్వారా ఇద్దరు పండింటి ఆడబిడ్డలకు జన్మించారు. రోడ్డు ప్రమాదంలో వీరి 18 ఏళ్ల కుమారుడు మృతి చెందడంతో సంతాన సాఫల్య కేంద్రాన్ని ఆశ్రయించారు ఉమ, సత్యనారాయణ దంపతులు. కరీంనగర్‌లో పద్మజా సంతాన సాఫల్య కేంద్రం ద్వారా ఆడబిడ్డలు జన్మనిచ్చింది ఉమ. ఐవీఎఫ్‌ ట్రీట్‌మెంట్‌ ద్వారా ఉమకు ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు.

అయితే వయసు పెరిగాక సంతానం కోసం ప్రయత్నిస్తే రిస్కే అంటున్నారు వైద్యులు. తమకు సంతానం లేకపోవడంతో 60, 70 ఏళ్ల తర్వాత సంతాన సాఫల్య కేంద్రాల ద్వారా తమ కలను సాకారం చేసుకుంటున్నారు వృద్దులు. అయితే ఇలా లేటు వయసులో పిల్లలను కనడం వల్ల పిల్లలకు అనేక సైడ్‌ ఎఫెక్ట్స్‌ వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు అసలు 50 ఏళ్ల తర్వాత పిల్లల్ని కనొద్దరి మరికొందరు వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

అయితే ఐసీఎంఆర్‌ గైడ్‌లైన్స్‌ ప్రకారం పిల్లలు కనాలంటే ఒక కటాఫ్‌ పెట్టారు. పురుషులైతే 55 ఏళ్లు. మహిళలైతే 50 ఏళ్ల వరకే కటాఫ్‌ ఉంది. మరోవైపు లేటు వయసులో పిల్లల్ని కన్న పేరెంట్స్‌ వారిని ఎన్నేళ్ల వరకు చూసుకోగలరు అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. ఇక అలాంటి పిల్లలు అనారోగ్యం పాలయ్యే అవకాశం కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉందంటున్నారు.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో