Breaking News
  • ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధానిని మార్చే హక్కు ఎవరికీ లేదు. సుప్రీంకోర్టు, రాష్ట్రపతి ఒప్పుకుంటేనే హైకోర్టు కదులుతుంది-కేశినేని. అమరావతి రక్షణకు పార్లమెంటు వేదికగా పోరాటం చేస్తాం-కేశినేని.
  • చిత్తూరు: తిరుచానూరు పీఎస్‌ నుంచి బేడీలతో పరారైన దొంగ. ట్రాక్టర్‌ దొంగతనం కేసులో నాగరాజును అరెస్ట్‌చేసిన పోలీసులు. దొంగ నాగరాజు కోసం గాలిస్తున్న పోలీసులు.
  • ఢిల్లీ: ఆప్‌ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు. నిర్భయ దోషులను రక్షించేందుకు ఆప్‌ ప్రభుత్వం యత్నిస్తోంది. కావాలనే న్యాయ ప్రక్రియను ఆలస్యం చేస్తోంది-మనోజ్‌ తివారీ. పోలీసులు తమ పరిధిలో లేరని తప్పించుకోవాలని ఆప్‌ చూస్తోంది -బీజేపీ ఢిల్లీ చీఫ్‌ మనోజ్‌ తివారీ.
  • అనంతపురం: తాడిపత్రిలో కత్తిపోట్లు. డబ్బుల విషయంలో స్నేహితుల మధ్య ఘర్షణ. రాము అనే వ్యక్తిని కత్తితో పొడిచిన రవితేజ. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందిన రాము.
  • రైతులు కన్నీళ్లు పెట్టినా సీఎం మనసు కరగడం లేదు. రాష్ట్రంలో పోలీస్‌ రాజ్యం నడుస్తోంది-దేవినేని ఉమ. విశాఖలో భూదందా నడుస్తోంది-మాజీ మంత్రి దేవినేని ఉమ. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం రాజధానిని విశాఖకు తరలిస్తున్నారు. పులివెందుల పులి డమ్మీ కాన్వాయ్‌తో వెళ్తోంది. దేశ చరిత్రలో డమ్మీ కాన్వాయ్‌తో వెళ్లిన సీఎం చరిత్రలో లేరు. సచివాలయానికి వెళ్లేందుకు మెటల్‌ రోడ్డు వేసుకుంటున్నారు. 5 కోట్ల మంది ప్రజలు రేపు రోడ్లపైకి రావాలి-దేవినేని ఉమ.

ఇంటర్‌లో పాస్, ఫెయిల్ విధానానికిక స్వస్తి..?

Changes In Education Policies Of Inter, ఇంటర్‌లో పాస్, ఫెయిల్ విధానానికిక స్వస్తి..?

ఈ పోటీ ప్రపంచంలో తమ పిల్లలు కూడా ఎల్లప్పుడూ ఫస్ట్ ఉండాలనుకునే తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు. ఆ క్రమంలోనే విద్యార్థుల మీద ర్యా‌ంకుల ప్రభావంతో పాటు ఒత్తిడి కూడా అధికంగా ఉంటోంది. ఉత్తీర్ణత సాధిస్తే పర్వాలేదు గానీ.. ఫెయిల్ అయితే మాత్రం.. స్టూడెంట్స్ జీవితంలోనే ఓడిపోయామనే భావనతో కృంగిపోయి.. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే.. ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లో చోటు చేసుకున్న అవకతవకల మధ్య ఎందరో విద్యార్థులు బలైపోయారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఇంటర్ బోర్డు కొత్త విధానానికి శ్రీకారం చుట్టాలని భావిస్తోంది. మరోవైపు విద్యా విధానంలో కూడా పలు మార్పులు చేయాలని అధికారులు కసరత్తులు చేస్తున్నారట.

మొదటగా ఇంటర్ మార్కుల పత్రాలపై ఇప్పటివరకు ఉన్న ఉత్తీర్ణత (పాస్‌), అనుత్తీర్ణత (ఫెయిల్‌) అనే ముద్రణలకు స్వస్తి పలికి.. వాటికి బదులుగా క్లియర్, అన్ క్లియర్ అని ముద్రించాలని తెలంగాణ ఇంటర్ బోర్డు యోచిస్తోందని తెలుస్తోంది. అంతేకాకుండా విదేశాల్లో మాదిరిగా ‘ఫ్లెక్సీ కోర్సు’ విధానాన్ని అమలు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ‘ఫ్లెక్సీ కోర్సు’ అంటే.. ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేసిన తర్వాత.. ఏదైనా చదువుకుని.. రెండు, మూడేళ్ళ వ్యవధిలో రెండో సంవత్సరం పూర్తి చేసుకోవచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనలను బోర్డు రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇలాంటి విధానం ఒడిశాలోని కొన్ని కాలేజీలలో అమలు అవుతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఈ రూల్ వస్తే.. ఇంటర్ విద్యలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి. విద్యార్థులకు కూడా ఈ విధానం ఎంతో వెసులుబాటుగా ఉంటుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.