యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై నెట్‌ఫ్లిక్స్ చౌకధరకే!

Netflix India launched a mobile-only plan for Rs 199 per month, యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై నెట్‌ఫ్లిక్స్ చౌకధరకే!

ఆన్లైన్‌ వీడియో స్ట్రీమింగ్ యాప్ నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు శుభవార్త చెప్పింది. ప్రత్యేకంగా ఇండియన్ యూజర్ల కోసం అత్యంత చవక నెలవారీ ప్లాన్‌ను ఇవాళ ప్రకటించింది. ఇకపై మొబైల్ లేదా ట్యాబ్‌లో ఎస్‌డి కంటెంట్‌ను వీక్షించేందుకు 199 రూపాయలు మాత్రమే. నెలకు రూ. 500 బేసిక్‌ ప్లాన్‌తో వినియోగదారులను ఆకట్టుకోలేకపోతున్న నెటిఫిక్ల్స్‌.. మిగిలిన ఆన్లైన్ స్ట్రీమింగ్ యాప్స్ అమెజాన్‌ ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్‌ ప్లాన్స్‌కు ధీటుగా తక్కువ ధరకే నెలవారీ ప్లాన్ ప్రకటించడం విశేషం.

499, 649 , 799 రూపాయల మధ్య ఉన్న ప్రస్తుత,  బేసిక్‌,  ప్రీమియం ప్రణాళికలతో పాటు నెట్‌ఫ్లిక్స్  తీసుకొచ్చిన  నాల్గవ ప్లాన్‌ ఇది.  ఫిక్కి నివేదిక ప్రకారం ఎక్కువ భారతీయ వినియోగదారులు 70శాతం మొబైల్ డేటాను ఎంటర్‌టైన్‌మెంట్‌‌కు ఉపయోగిస్తుండడంతో వారిని ఆకర్షించే విధంగా దీనిని రూపొందించామని నెట్‌ఫ్లిక్స్ పార్టనర్‌ ఎంగేజ్‌మెంట్ డైరెక్టర్ నిగెల్ బాప్టిస్ట్ చెప్పారు. దాదాపు పదమూడు కొత్త చిత్రాలు, తొమ్మిది కొత్త ఒరిజినల్ సిరీస్‌లు ఇప్పటికే అందుబాటులో ఉంచినట్లు సంస్థ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *