Viral News: ‘అరుంధతి’ అతడి ప్రాణాలు తీసింది.. సినిమా సీన్ అనుసరించి యువకుడి ఆత్మహత్య..

సినిమాలు కేవలం ఎంటర్ టెయిన్ మెంట్ కోసమే.. నేటి బిజీ షెడ్యూల్ లో సినిమా చూడటం ద్వారా కొంత సమయం మన రెగ్యులర్ వర్క్ ని పక్కన పెట్టి రిలాక్స్

Viral News: 'అరుంధతి' అతడి ప్రాణాలు తీసింది.. సినిమా సీన్ అనుసరించి యువకుడి ఆత్మహత్య..
Fire
Follow us

|

Updated on: Aug 13, 2022 | 11:04 AM

Viral News: సినిమాలు కేవలం ఎంటర్ టెయిన్ మెంట్ కోసమే.. నేటి బిజీ షెడ్యూల్ లో సినిమా చూడటం ద్వారా కొంత సమయం మన రెగ్యులర్ వర్క్ ని పక్కన పెట్టి రిలాక్స్ అయిపోవచ్చు. అయితే కొంతమంది మాత్రం సినిమాలకే అంకితమవుతూ.. సినిమా సీన్ లను అనుసరించి తమ ప్రాణాల మీదకి తెచ్చుకుంటుంటారు. అలాంటి ఘటనే ఒకటి కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో జరిగింది. తుమకూరు జిల్లా మధుగిరి సమీపంలో ఓ గ్రామానికి చెందిన రేణుకా ప్రసాద్ పదో తరగతి వరకు చదువులో టాపర్ గా ఉండేవాడు. అతడిని బాగా చదివిద్దామనుకున్న తల్లిదండ్రులు ఇంటర్మీడియట్ చదువు కోసం తుమకూరు పంపారు. అయితే సినిమాలకు అడిక్షన్ అవ్వడంతో ఇంటర్మీడియట్ విద్యను మధ్యలోనే ఆపేసి ఊర్లో ఖాళీగా ఉండేవాడు.

సినిమాలు ఎక్కువుగా చూసే అలవాటును తగ్గించడానికి తన తల్లిదండ్రులు ప్రయత్నించినప్పటికి ఉపయోగం లేకుండాపోయింది. తెలుగు హార్రర్ సినిమా అరుంధతిని దాదాపు 20 సార్లు చూశాడు. ఈసినిమాలో నిప్పటించుకున్న సీన్ ను తాను చేస్తానంటూ కొద్దిరోజులుగా తన ఇంట్లో కుటుంబసభ్యులకు చెప్పాడు. దానిని పెద్దగా పట్టించుకోలేదు రేణుకా ప్రసాద్ పేరెంట్స్.. అయితే మూడు రోజుల క్రితం రేణుకా ప్రసాద్ 20 లీటర్ల పెట్రోల్ కొనుగోలు చేసి ఊరు శివారుకు వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటల్లో కాలిపోతున్న రేణుకా ప్రసాద్ ను గమనించిన స్థానికులు మంటలు ఆర్పి కాలిన గాయాలతో ఉన్న బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. 60 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న ప్రసాద్ శుక్రవారం ప్రాణాలు కోల్పోయాడు. ఆత్మహత్యకు ముందు తన తండ్రి సిద్ధప్పను ఉద్దేశించి రేణుకా ప్రసాద్ ఓ వీడియోను రికార్డు చేశాడు. తన ఆత్మార్పణతో వారికి మోక్షం లభిస్తుందంటూ వీడియోల పేర్కొన్నాడు. దీంతో కేవలం వినోదం కోసమే సినిమాలను పరిమితం చేయాలి తప్పా.. నిజ జీవితంలో మూవీ సీన్స్ ను ఫాలో అవ్వొద్దు బి.. కేర్ ఫుల్.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో