Rewind 2021: చరిత్రలో ఈ ఏడాది.. దేశంలో చోటుచేసుకున్న అతిపెద్ద ఘటనలు..

|

Dec 22, 2021 | 2:02 PM

Year Ender 2021: చరిత్రలో మర్చిపోలేని చరితగా 2021వ సంవత్సరం మిగిలిపోనుంది. 2019 చివరి నుంచి యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తున్న కంటికి కనిపించని కరోనా భూతం భారత్‌లో విలయతాండవం చేసింది. కోవిడ్-19 సెకండ్ వేవ్‌లో భారత్‌లో లక్షలాది మంది కరోనా బారిన పడగా.. వేలాది మంది మరణించారు. చికిత్సకు ఆక్సిజన్, మందులు లభించక చాలామంది తనువుచాలించారు. దీంతోపాటు వ్యవసాయ చట్టాలపై రైతు నిరసనలు, గణతంత్ర దినోత్సవం రోజున చెలరేగిన హింస, ప్రముఖుల మరణాలు, రాజకీయ హింస, లఖీంపూర్ ఖేరీ ఘటన, సీడీఎస్ బిపిన్ రావత్ మరణం, ఇలా చాలా ఘటనలు దేశాన్ని కుదిపేశాయి. వీటితోపాటు 2021వ సంవత్సరంలో అనేక విధ్వంసాలు, ప్రకృతి విలయాలు, విపత్కర పరిస్థితులు, హింస, విషాదానికి సంబంధించిన సంఘటనలు ఇలా చాలానే ఉన్నాయి. అయితే.. మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం.. ఈ నేపథ్యంలో ఈ ఏడాది దేశంలో జరిగిన వివాదాస్పద సంఘటనలు, విషాదాన్ని మిగిల్చిన టాప్-9 సంఘటనల గురించి ఇప్పుడు ఒకసారి చూద్దాం..

1 / 9
గణతంత్ర దినోత్సవం రోజు చెలరేగిన హింస.. కొత్త వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ ఢిల్లీలో వేలాది మంది రైతులు జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవం నాడు ట్రాక్టర్ మార్చ్ నిర్వహించారు. ఈ ఘటన హింసాత్మకంగా మారింది. కొంతమంది రైతులు అడ్డంకులను ఛేదించి పోలీసులతో పోరాడి ఢిల్లీలోకి ప్రవేశించారు. ఈ క్రమంలో చారిత్రాత్మక ఎర్రకోటపై నిరసనకారులు జాతీయ జెండా పక్కన ఓ మతానికి ప్రతీక అయిన స్మారక పతాకాన్ని ఎగురవేశారు. ఈ ఘటనలో పలువురు రైతులు మరణించగా.. పోలీసులు గాయపడ్డారు. కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది.

2 / 9
బెంగాల్ ఎన్నికలు - హింస ఈ ఏడాది జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. శాసనసభ ఎన్నికల ఫలితాల తర్వాత పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో హత్యలు, అత్యాచారాలు, విధ్వంసాలు జరిగాయి. మేలో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC) మూడవసారి అధికారాన్ని చేపట్టింది. అయితే.. ఫలితాల ప్రకటన అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలు దేశంలో చర్చనీయాంశంగా మారాయి.

3 / 9
కరోనా సెకండ్ వేవ్, ఆక్సిజన్ సంక్షోభం, బ్లాక్ ఫంగస్ కరోనా సెకండ్ వేవ్ భారత్‌లో విలయతాండవం సృష్టించింది. సెకండ్ వేవ్‌లో కోట్లాది మంది మహమ్మారి బారిన పడగా.. లక్షలాది మంది చనిపోయారు. దీంతోపాటు ఈ సమయంలో ఆస్ప‌త్రుల్లో బెడ్స్ నిండిపోయి.. వైద్యం కోసం ఆసుపత్రుల ముందు రోగుల ప‌డిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. ఆక్సిజ‌న్ కొర‌త‌తో, అత్యవసర చికిత్సలో వినియోగించే మందులు లభించక రోగులు చ‌నిపోయ‌న దృశ్యాలు సెకండ్ వేవ్ లో కోకొల్లలుగా క‌నిపించాయి. స్మశానాలు మృతుల‌తో నిండిపోవ‌డం, గంగా నదిలో శ‌వాలు కొట్టుకురావ‌డం.. యూపీ బీహార్ లోని గంగాన‌ది ఇసుక దిబ్బల్లో వ‌ర్షానికి శ‌వాలు బ‌య‌ట‌ప‌డ‌టం క‌రోనా పంజాకు నిదర్శనంగా నిలిచాయి. దీంతోపాటు బ్లాక్ ఫంగస్ కూడా దేశంలో విజృంభించింది. బ్లాక్ ఫంగస్ కారణంగా చాలా మంది మరణించారు.

4 / 9
ఉచిత కోవిడ్-19 టీకాలు దేశంలో కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం.. జనవరి 16న వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ప్రారంభించింది. మొదటి ఆరోగ్య సిబ్బందికి, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ పంపిణీ చేశారు. ఆ తర్వాత విడతల వారీగా వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ వేగవంతంగా జరిగేలా ప్రభుత్వం కోవిన్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిద్వారా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం వేగవంతమయ్యేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఆ తర్వాత జూన్ 7న ప్రధాని మోదీ అందరికీ ఉచిత వ్యాక్సిన్‌లను అందిస్తామని ప్రకటించారు. టీకా తయారీదారుల నుంచి 75 శాతం వ్యాక్సిన్‌లను కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు ఉచితంగా అందిస్తామని ప్రధాని మోదీ వెల్లడించారు. దీంతో భారతదేశం అక్టోబర్ 21న వరకు 100 కోట్ల కోవిడ్-19 డోసులను పంపిణీ చేసింది. ఇప్పటివరకు భారత్ దాదాపు 1.36 బిలియన్ డోస్‌ల కోవిడ్-19 వ్యాక్సిన్‌ని అందించింది.

5 / 9
పండోర పేపర్ లీక్‌  ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ICIJ) అక్టోబర్ 3న 200 దేశాలు, ఆయా భూభాగాలకు చెందిన రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ప్రముఖుల పేర్లతో కూడిన 11.9 మిలియన్ ఫైళ్లను లీక్ చేసింది. నల్లడబ్బును విదేశాల్లో దాచిపెట్టిన వారి వివరాలను ఐసీఐజే వెల్లడించింది.  ఈ జాబితాలో ప్రముఖ వ్యాపారవేత్తలు, క్రీడా ప్రముఖులు, సినీ తారలు సహా 300 మందికి పైగా భారతీయుల పేర్లు ఉన్నాయి.

6 / 9
హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ మృతి.. భారత సైనికాధికారి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. డిసెంబరు 8న తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ ఆయన భార్య సహా  13 మంది మరణించారు. ఈ దుర్ఘటన దేశంలో అత్యంత విషాదాన్ని మిగిల్చింది. బిపిన్ రావత్‌ను 2019లో మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా నియమించింది.

7 / 9
ప్రముఖల మరణాలు..  కరోనా కాలం సామాన్యులు, ప్రముఖులతోపాటు, సినీ సంగీత కళాకారులను కూడా మింగేసింది. దీంతోపాటు అనారోగ్య కారణాలు, ప్రమాదాల బారిన పడి మరికొంతమంది ప్రాణాలు కోల్పోయారు. అలా ఈ ఏడాది మనకు దూరమైన వారిలో సిరివెన్నెల సీతారామశాస్త్రి, పునీత్‌ రాజ్‌కుమార్‌, వివేక్‌, దిలీప్‌ కుమార్‌, వడివేలు, శివశంకర్‌ మాస్టర్‌ లాంటి ప్రముఖులు ఉన్నారు.

8 / 9
వ్యవసాయ చట్టాల రద్దు - నిరసన విరమించిన రైతులు  మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని.. రైతులు గత ఏడాది నవంబర్ నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు తెలిపారు. ప్రధానంగా పంజాబ్, హర్యానాకు చెందిన వేలాది మంది రైతులు మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేపట్టారు. మోడీ ప్రభుత్వం రైతులను ఒప్పించేందుకు ప్రయత్నించింది.. కానీ రైతులు, సంఘాలు దీనికి నిరాకరించారు. దీంతో ప్రధాని మోడీ నవంబర్ 19న తన ప్రభుత్వం చట్టాలను రద్దు చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. అయినప్పటికీ రైతులు పలు డిమాండ్లను పరిష్కరించాలని నిరసనలను కొనసాగించారు. దీంతో కేంద్రం వారి డిమాండ్లను అంగీకరిస్తున్నామని.. వాటి పరిష్కారానికి ఏర్పాటు చేసే కమిటీలో రైతులు ఉంటారని అధికారికంగా లేఖను అందజేయడంతో రైతులు డిసెంబర్ 9న నిరసనను విరమించుకున్నారు. దీంతో సంవత్సరం పాటు కొనసాగిన నిరసనలకు మోదీ ముగింపు పలికారు.

9 / 9
లఖీంపూర్ ఖేరీ ఘటన.. యూపీలని లఖింపుర్‌ ఖేరీలో కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రా పర్యటనలో హింస చెలరేగింది. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ.. నిరసన చేస్తున్న రైతులపైకి కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిశ్‌ మిశ్రా కారుతో దూసుకెళ్లాడు. ఈ ఘటనలో నలుగురు రైతులు మరణించగా.. ఆ తర్వాత జరిగిన ఘర్షణల్లో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మొత్తం 8 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం దీనికి సంబంధించిన వీడియో సైతం వైరల్‌ కావడంతో.. దేశవ్యాప్తంగా రైతులు, పలు పార్టీలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. కేంద్రమంత్రిగా ఉన్న అజయ్ మిశ్రాను వెంటనే తొలగించాలంటూ విపక్షాలు డిమాండ్ చేశాయి.