sushil kumar dramatic arrest….కారు వదిలి స్కూటర్ పై వెళ్తుండగా నాటకీయంగా రెజ్లర్ సుశీల్ కుమార్ అరెస్ట్ , మూడు అభియోగాల నమోదు

సాగర్ రాణా అనే యువ రెజ్లర్ మృతి కేసుతో ప్రమేయముందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒలంపిక్ మెడలిస్ట్ సుశీల్ కుమార్ ని, అతని సహచరుడు అజయ్ కుమార్ ని పోలీసులు నాటకీయ పరిణామాల మధ్య అరెస్టు చేశారు...

sushil kumar dramatic arrest....కారు వదిలి స్కూటర్ పై వెళ్తుండగా నాటకీయంగా రెజ్లర్ సుశీల్ కుమార్ అరెస్ట్ , మూడు అభియోగాల నమోదు
Photo

Edited By: Anil kumar poka

Updated on: May 23, 2021 | 5:35 PM

సాగర్ రాణా అనే యువ రెజ్లర్ మృతి కేసుతో ప్రమేయముందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒలంపిక్ మెడలిస్ట్ సుశీల్ కుమార్ ని, అతని సహచరుడు అజయ్ కుమార్ ని పోలీసులు నాటకీయ పరిణామాల మధ్య అరెస్టు చేశారు. సుశీల్, అజయ్ తమ కారును ఒక చోట వదిలి స్కూటర్ పై వెళ్తుండగా పశ్చిమ ఢిల్లీలోని ముంద్ కా ప్రాంతంలో వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో ఎవరినో కలుసుకునేందుకు వీరు వెళ్తున్నట్టు తెలిసిందని పోలీసులు చెప్పారు.నగరంలోని ఛత్రపాల్ స్టేడియం వద్ద ఈ నెల మొదటివారంలో జరిగిన ఘర్షణలో సాగర్ రాణా మరణించగా…. మరో ఇద్దరు గాయపడ్డారు. అతని మృతితో తనకు సంబంధం లేదని మొదట బుకాయించిన సుశీల్ కుమార్ ఆ తరువాత పరారయ్యాడు. అరెస్టు కాకుండా తప్పించుకునేందుకు హరిద్వార్, రుషికేశ్ లలో తలదాచుకున్నాడు. రుషికేశ్ లో తనకు తెలిసిన బాబా ఆశ్రమంలో సుశీల్ కుమార్ దాక్కున్నాడని ఆ మధ్య ఓ హిందీ డైలీలో వార్తలు వచ్చాయి. ఇతని అరెస్టుకు దోహదపడే సమాచారం తెలిపినవారికి లక్ష రూపాయలు, ఇతని సహచరుడైన అజయ్ ఆచూకీ తెలిపినవారికి 50 వేల రూపాయల రివార్డు ఇస్తామని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. ఢిల్లీ కోర్టు సుశీల్ కుమార్ కు నాన్-బెయిలబుల్ అరెస్టు వారెంట్లు జారీ చేసింది. మీరట్ లోని ఓ టోల్ ప్లాజా వద్ద సుశీల్ కుమార్ కారులో కూర్చున్న ఓ ఫోటోను ఓ మీడియా సంస్థ ఇటీవల ప్రచురించింది. ఆ ఫోటో ఆధారంగా ఆ కారు ఆచూకీని కనుగొనేందుకు ఖాకీలు మొదట ప్రయత్నాలు మొదలు పెట్టారు.

కాగా హత్య, కిడ్నాప్, క్రిమినల్ కుట్ర వంటి అభియోగాలను సుశీల్ కుమార్ పై పోలీసులు నమోదు చేశారు. మే 4 న మోడల్ టౌన్ లోని సాగర్ రానా ఇంటి నుంచి అతడిని సుశీల్ కిడ్నాప్ చేశాడని సాగర్ సన్నిహితులు పోలీసులకు తెలిపారు.

మరిన్ని చదవండి ఇక్కడ : sonu sood video : పాన్ ఇండియా మూవీ హీరోగా సోను భాయ్..క్రిష్ దర్శకత్వంలో రియల్ హీరో టూ రీల్ హీరో

వావ్ కాంబినేషన్ సాయి పల్లవి సరసన డేవిడ్ వార్నర్.. వైరల్ అవుతున్న వీడియో ..:David Warner dance video.