ప్రపంచంలోనే అతి పొడవైన అటల్ టన్నెల్ రెడీ..

| Edited By: Pardhasaradhi Peri

Sep 16, 2020 | 7:10 PM

ప్రపంచంలోనే అతి ఎత్తైన ప్రదేశంలో అతి పొడవైన టన్నెల్‌ ప్రారంభానికి సిద్ధమైంది. భారత్‌కు అత్యంత కీలకమైన వ్యూహాత్మక ఈ రహదారిని, త్వరలో ప్రధాని మోదీ జాతికి అంకితమివ్వనున్నారు.

ప్రపంచంలోనే అతి పొడవైన అటల్ టన్నెల్ రెడీ..
Follow us on

ప్రపంచంలోనే అతి ఎత్తైన ప్రదేశంలో అతి పొడవైన టన్నెల్‌ ప్రారంభానికి సిద్ధమైంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలీ, లద్దాఖ్‌లో లేహ్‌ను అనుసంధానించే ఈ సొరంగమార్గం..త్వరలోనే అందుబాటులోకి రానుంది. భారత్‌కు అత్యంత కీలకమైన వ్యూహాత్మక ఈ రహదారిని ప్రధాని మోదీ జాతికి అంకితమివ్వనున్నారు.

సముద్ర మట్టానికి 10 వేల అడుగుల ఎత్తులో ఈ టన్నెల్‌ను నిర్మించారు. మనాలి, లేహ్‌ హైవేపై రోహ్తంగ్‌ పాస్ కింద..ఈ టన్నెల్‌ నిర్మాణానికి పదేళ్లు పట్టింది. ఈ సొరంగ మార్గంతో మనాలి-లేహ్‌ మధ్య దూరం సుమారు 46 కిలోమీటర్లు తగ్గనుంది. దీని ద్వారా 4గంటల సమయం ఆదా అవుతుందని స్పష్టం చేశారు అధికారులు. ఈ సొరంగ మార్గానికి మాజీ ప్రధాని, భారత‌ రత్న అటల్ బిహారీ వాజ‌పేయి పేరు పెట్టారు. అటల్ రోహ్తంగ్ టన్నెల్‌గా పిలుస్తున్నారు.

2010 జూన్ 28న‌ ఈ టన్నెల్‌కు శంకుస్థాపన చేశారు. ఆరేళ్లలోనే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా..పదేళ్లు పట్టిందని వెల్లడించారు అధికారులు. దీనిని బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ నిర్మిస్తోంది. సుమారు రూ. 4 వేల కోట్ల రూపాయలు వెచ్చించి, గుర్రపుడెక్క ఆకారంలో ఈ సొరంగ మార్గాన్ని నిర్మించారు. ఇందుకోసం అత్యాధునిక ఆస్ట్రేలియన్ టన్నెలింగ్ పద్ధతులను అనుస‌రించారు. టన్నెల్‌ లోపల ప్రతి 60 మీటర్లకు ఒక సీసీ కెమెరా..ప్రతి 500 మీటర్లకు ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ ఏర్పాటుచేశారు.

 

ఈ సొరంగం లోపల ఏ వాహనమైనా గంటకు గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో ప్ర‌యాణించేందుకు అవ‌కాశ‌ముంది. లదాఖ్‌లో మోహరించిన భారత సైనికుల‌కు ఈ టన్నెల్‌ ఎంతో ఉపయోగపడుతుందటున్నారు అధికారులు. శీతాకాలంలో ఆయుధాలు, లాజిస్టిక్స్ సరఫరా సులభమవుతుందని అంటున్నారు. ఈ నెల చివర్లో ప్రధాని మోదీ ఈ టన్నెల్‌ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.