Mud bath video: దేశవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అయితే కొన్ని చోట్ల వర్షాలు లేకపోవడంతో పలు గ్రామాల ప్రజలు వింత ఆచారాలు పాటిస్తున్నారు. ఈ ఏడాది బాగా వర్షాలు కురవాలని కోరుకుంటూ వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు స్థానిక ఎమ్మెల్యేకు.. ప్రజలు బురద స్నానం చేయించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లాలో జరిగింది. మహారాజ్‌గంజ్ ప్రాంతంలో వర్షాలు కురవాలని, వరుణ దేవుడి ప్రసన్నం కోసం కొందరు మహిళలు స్థానిక ఎమ్మెల్యే, నగర పాలక ఛైర్మన్‌పై బురద చల్లారు. బురద స్నానం చేయడం వల్ల వరుణ దేవుడు ఇంద్రుడు వర్షాలను కురిపిస్తాడని.. ఈ ప్రాంత వాసుల నమ్మకం. ఇలా చేస్తే కరువు సంభవించకుండా.. పంటలు బాగా పండుతాయని విశ్వసిస్తారు. ఈ మేరకు మహారాజ్‌గంజ్‌లోని పిపర్‌డ్యూరా ప్రాంతంలోని మహిళలు.. బీజేపీ ఎమ్మెల్యే జైమంగల్ కనోజియా, నగర పాలికా చైర్మన్ కృష్ణ గోపాల్ జైస్వాల్‌లకు మట్టి స్నానం చేయిస్తూ పాటలు పాడారు. అయితే.. నగర పాలకుడికి బురద స్నానం చేయిస్తే ఇంద్రుడు సంతోషిస్తాడని ఈ ప్రాంత వాసులు పేర్కొంటున్నారు. తక్కువ వర్షపాతం కారణంగా వరి దిగుబడిపై ప్రభావం చూపుతుందని.. అందుకే ప్రతీ ఏటా తాము సంబరాలు చేస్తామని ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్నీ దేవి వెల్లడించింది. ఇంద్ర దేవుడిని సంతోషపెట్టడానికి, పిల్లలు బురదలో స్నానం చేస్తారని.. స్థానికంగా దీనిని కల్ కలూటి అని పిలుస్తారని ఆమె పేర్కొంది.
బురద స్నానం వీడియో..
#WATCH | Women in Pipardeura area of Maharajganj in Uttar Pradesh throw mud at MLA believing this will bring a good spell of rainfall for the season pic.twitter.com/BMFLHDgYxb
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 13, 2022
మట్టి స్నానం చేయడం అనాదిగా వస్తున్న ఆచారమని ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే జైమంగల్ కనోజియా తెలిపారు. ఎమ్మెల్యే కనోజియపాటు నగర పాలిక చైర్మన్ జైస్వాల్ వర్షం కోసం బురద స్నానం చేశారు. ఎండవేడిమితో ప్రజలు సతమతమవుతున్నారని.. వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు మట్టి స్నానం చేయడం అనాదిగా వస్తుందన్నారు. నగరంలోని మహిళలంతా వర్షం కోసం మట్టి స్నానం చేస్తారని కనోజియా తెలిపారు. కరువు పరిస్థితులు పోవాలని.. పంటలు మంచిగా పండాలని వానదేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఇది తరతరాలుగా వస్తున్న ఆచారంగా పేర్కొన్నారు.