Mothers Love: తల్లికి కొత్తఫోన్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన కొడుకు.. అమ్మ ఆనందాన్ని వెలకట్టలేమంటున్న మాధవన్

|

Jan 08, 2022 | 7:22 PM

Mothers Love: తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉత్తమమైన విద్యను, మంచి భవిష్యత్ ను అందించడానికి రాత్రీపగలు కష్టపడతారు. పిల్లల అభివృద్ధి కోసం వారి కోరికలు తీర్చడం కోసం..

Mothers Love: తల్లికి కొత్తఫోన్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన కొడుకు.. అమ్మ ఆనందాన్ని వెలకట్టలేమంటున్న మాధవన్
Woman's Priceless Reaction
Follow us on

Mothers Love: తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉత్తమమైన విద్యను, మంచి భవిష్యత్ ను అందించడానికి రాత్రీపగలు కష్టపడతారు. పిల్లల అభివృద్ధి కోసం వారి కోరికలు తీర్చడం కోసం తమ కనీస అవసరాలను కూడా పక్కన పెడతారు. దీనికి ప్రతి ఫలంగా.. తమ పిల్లలు అన్నింటా సక్సెస్ అందుకోవాలని.. బాధ్యతాయుతమైన వ్యక్తులుగా ఎదగాలని తల్లిదండ్రులు ఆశిస్తారు. అయితే తమకోసం తల్లిదండ్రుల పడిన కష్టాన్ని గుర్తు పెట్టుకుని.. వారి పిల్లలు తల్లిదండ్రులకు సర్పరైజింగ్ గిఫ్ట్ ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే, మీరు ఎప్పుడైనా వారి ముఖంలో చిరునవ్వు తెచ్చే పని చేశారా లేదా వారిని పూర్తిగా ఆశ్చర్యపరిచారా?.. అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఒక కొడుకు తన తల్లి పుట్టిన రోజు బహుమతిగా ఒక కొత్త ఫోన్‌ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. అయితే కొడుకు తనకు ఇచ్చిన బహుమతిని చూసి.. తల్లి పొందిన ఆనందం ఆమె స్పందన అమూల్యమైనది. ఈ వీడియో క్లిప్‌ను ప్రముఖ నటుడు ఆర్ మాధవన్‌ రీట్వీట్ చేశాడు. దీంతో ఈ వీడియో ఇప్పుడు మరింత మంది నెటిజన్లకు చేరువైంది.

ఈ వీడియోను జనవరి 5న  ట్విట్టర్ వినియోగదారుడు  విఘ్నేష్ సమ్మూ పోస్ట్ చేశారు.  అప్పటి నుండి ఈ వీడియో  4 లక్షలకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఈ వీడియో తమిళంలో క్యాప్షన్ కూడా జత చేశాడు.. అది ఏమిటంటే.. “బ్యాగ్ లోపల రూ. 8800 విలువైన ఫోన్ ఉంది. అయితే మా అమ్మ అనుభవించిన ఆనందానికి వెల లేదు.” విఘ్నేష్ తన తల్లి పుట్టినరోజుకి ఇచ్చిన బహుమతి అని తెలుస్తోంది.

ఈ వీడియోలో తల్లి ఒక బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తుంది. అప్పుడు ఆ బ్యాగ్ లో కనిపించిన ఫోన్ ను చూసిన తర్వాత ఆమె పొందిన ఆనందం మాటల్లో వర్ణించలేనిది. ఆమె స్పందన స్వచ్ఛమైన బంగారం. తన కొడుకు తనకు చాలా విలువైన వస్తువు  బహుమతిగా ఇవ్వడం చూసిన తర్వాత తల్లి ప్రేమ ఆనందం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. అంతేకాదు.. తల్లి మనసు  R మాధవన్  మనసుని కూడా హత్తుకుంది. అందుకనే ఈ వీడియో రీ ట్విట్ చేస్తూ.. “ఈ ఆనందానికి ధర లేదు (sic)” అనే క్యాప్షన్ ఇచ్చాడు.

 

Also Read: మళ్ళీ కరోనా, ఓమిక్రాన్ భయపెడుతున్న వేళ.. రోగనిరోధక శక్తిని ఈ స్మూతితో పెంచుకోండి.. తయారీ విధానం