ఖాకీల వేధింపులు భరించలేని ఓ ఇల్లాలు టవర్ ఎక్కి నిరసన చేపట్టింది. దాంతో స్థానికంగా తీవ్ర కలకలం మొదలైంది. ఆమెను కిందకు దింపేందుకు స్థానికులు శతవిధాలా ప్రయత్నించారు. భారీగా గుమిగూడిన జనం రద్దీతో ఆ ప్రాంతమంతా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ ఘటన మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో చోటు చేసుకుంది. ఓ మహిళ టవర్ ఎక్కి నిరసన చేయటంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది.
సమాచారం అందుకున్న పోలీసులు, తహసీల్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుంది. ఈ సందర్భంగా సదరు మహిళ తన సమస్యను అధికారులకు చెప్పుకుంది. తన భర్తపై పోలీసులు వేధింపుల కేసు నమోదు చేశారని, అది పూర్తిగా అవాస్తవమని మహిళ పేర్కొంది. వెంటనే కేసును ఉపసంహరించుకోవాలని మహిళ డిమాండ్ చేసింది.
పోలీసులు-పరిపాలన, తహసీల్ అధికారుల హామీ మేరకు ఎట్టకేలకు మహిళ కిందకు దిగిపోయింది. మహిళ దిగిన తర్వాత మెహకర్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ