బాలాఘట్‌లో తొలిసారి అరుదైన ఘటన..వింతను చూసేందుకు ఎగబడ్డ జనం..

|

May 24, 2022 | 5:21 PM

శిశువుల జననాలకు సంబంధించి మధ్యప్రదేశ్‌లో అద్భుతం చోటు చేసుకుంది. బాలాఘాట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి అంటున్నారు అక్కడి స్థానికులు. దీంతో

బాలాఘట్‌లో తొలిసారి అరుదైన ఘటన..వింతను చూసేందుకు ఎగబడ్డ జనం..
4 Babies Devlivery
Follow us on

శిశువుల జననాలకు సంబంధించి మధ్యప్రదేశ్‌లో అద్భుతం చోటు చేసుకుంది. ఒకే కాన్పులో నలుగులు పిల్లలకు జన్మనిచ్చింది ఓ మహిళ. ఈ అరుదైన సంఘటన మధ్యప్రదేశ్​లోని బాలాఘట్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. కిర్నాపుర్ తహసీల్‌లోని జరాహి గ్రామానికి చెందిన 26 ఏళ్ల ప్రీతి నంద్‌లాల్ మెష్రామ్ ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. కాన్పు కోసం వచ్చిన ప్రీతికి ఆపరేషన్ చేసిన వైద్యులు నలుగురు శిశువులను బయటకు తీశారు. వీరిలో ముగ్గురు మగపిల్లలు కాగా ఒక ఆడపిల్ల పుట్టింది. జారాహి గ్రామానికి చెందిన ప్రీతి మెప్రాం నలుగురు శిశువులకు జన్మనిచ్చింది.

అయితే తల్లి ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ శిశువులు నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ICU కి తరలించి వైద్యం అందిస్తున్నారు డాక్టర్లు. బాలాఘాట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి అంటున్నారు అక్కడి స్థానికులు. దీంతో చిన్నారులను చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. ఒకే కాన్పులో నలుగురు శిశువులు కావటంతో అక్కడి వారంతా ఆశ్యర్యంతో చూశారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు, కర్ణాటక శివమొగ్గ​ జిల్లాలోనూ ఓ గర్భిణీ నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. జిల్లాలోని భద్రావతి మండలం తడస గ్రామానికి చెందిన అల్మాబాను మే 23న డెలీవరి అయ్యింది. ఒకే కాన్పులో నలుగురికి జన్మనిచ్చింది. అల్మాబానుకి ఎనిమిదో నెలలోనే ప్రసవ నొప్పులు రావటంతో వెంటనే, కుటుంబ సభ్యులు ఆమెను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. నార్మల్‌ డెలీవరి కాకపోవటంతో వైద్యులు సిజేరియన్ చేశారు. ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలకు జన్మించారు. శిశువులు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు చెప్పారు.