కన్నడ నటి సంయుక్త హెగ్డేపై దాడి…

| Edited By: Ravi Kiran

Sep 05, 2020 | 2:05 PM

అనుకోని ప‌రిణామాలు ఒక్కోసారి షాక్‌కు గురి చేస్తుంటాయి. తాజాగా కన్నడ నటి సంయుక్త హెగ్డేకు అలాంటి పరిస్థితే ఎదురైంది. సంయుక్త హెగ్డేతోపాటు ఆమె స్నేహితులపై శనివారం మూక దాడి జరిగింది.

కన్నడ నటి సంయుక్త హెగ్డేపై దాడి...
Follow us on

అనుకోని ప‌రిణామాలు ఒక్కోసారి షాక్‌కు గురి చేస్తుంటాయి. తాజాగా కన్నడ నటి సంయుక్త హెగ్డేకు అలాంటి పరిస్థితే ఎదురైంది. ఊహించని షాక్ తగిలింది. సంయుక్త హెగ్డేతోపాటు ఆమె స్నేహితులపై శనివారం మూక దాడి జరిగింది.

కన్నడ హీరోయిన్ సంయుక్త హెగ్డే తన స్నేహితులతో కలిసి శనివారం బెంగళూరులోని ఓ పార్క్ కు వెళ్లింది. స్పోర్ట్స్ బ్రా వేసుకొని పార్కులో డాన్స్, వర్కవుట్స్ చేస్తుండగా అక్కడే వున్న కవితారెడ్డి అనే మహిళా సంయుక్తతోసహా స్నేహితులపై దాడి చేసింది. అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ దూషణలకు దిగింది.

ఫిట్ నెస్ ను బాగా ఇష్టపడే సంయుక్త తన ఫ్యాన్స్ కు హులా హూప్ నేర్పిస్తుంటుంది. దీంట్లో భాగంగానే బెంగళూరులోని అగరా లేక్ కు సమీపంలోని పార్క్ లో తన ఫ్రెండ్స్ తో కలసి వెళ్లింది. ఈ సమయంలో అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు పబ్లిక్ ప్లేస్ లో స్పోర్ట్స్ ఔట్ ఫిట్ ఎందుకు వేసుకున్నావంటూ సంయుక్తతోపాటు ఆమె స్నేహితులను దూషించారు. శాండిల్ వుడ్ డ్రగ్ రాకెట్ లో ఇరికిస్తామని బెదిరించారు.

దీనికి సంబంధించిన ఒక వీడియోను సంయుక్త ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. సదరు వీడియోలో తనను దూషించిన మహిళ గురించి సంయుక్త వివరించింది. సదరు మహిళను కవితా రెడ్డిగా గుర్తించారు. తన ఫ్రెండ్ పై అకారణంగా కవితా రెడ్డి దాడికి దిగిందని సంయుక్త ఆరోపించింది. ఘటనకు సంబంధించి తన వద్ద పలు వీడియో ఆధారాలు ఉన్నట్లు పేర్కొంది.

తెలుగులో నాగార్జున‌తో మ‌న్మ‌థుడు 2, నిఖిల్‌తో కిర్రాక్ పార్టీ వంటి చిత్రాల‌తో పాటు ప‌లు త‌మిళ చిత్రాల్లో న‌టించిన హీరోయిన్ సంయుక్త హ‌గ్డే.