శబరిమల వెళ్లేందుకు కేరళలోని కోచ్చికి చేరుకున్న మహిళా సామాజిక వేత్త బిందు అమ్మినిపై ఒక వ్యక్తి పెప్పర్ స్ప్రే, కారం పొడి చల్లాడు. పోలీసు కమిషనర్ కార్యాలయం బయటే ఈ ఘటన జరిగింది. ఈ హఠాత్సంఘటనతో బిత్తరపోయిన బిందు అమ్మిని.. బాధతో తన ముఖాన్ని కప్పుకుంటూ పరుగులు తీసింది. బహుశా హిందూ వాహినికి చెందిన వ్యక్తే ఆమెపై ఈ దాడి జరిపివుంటాడని భావిస్తున్నారు. తన ముఖంపై అతడు ఈ ఎటాక్ కు పాల్పడి పారిపోతున్నప్పటికీ అక్కడే ఉన్న పోలీసులు చోద్యం చూస్తున్నారని బిందు మండిపడింది. అతడిని పట్టుకోవడానికి వారు ఎలాంటి ప్రయత్నం చేయలేదని ఆరోపించింది. ఆమెను పోలీసులు మొదట ఆసుపత్రికి, అనంతరం అజ్ఞాత ప్రదేశానికి తీసుకువెళ్లారు .బిందు అమ్మిని గత ఏడాది కూడా శబరిమల దర్శించుకుంది. అటు-శబరిమల వెళ్లేందుకు మరో హక్కుల కార్యకర్త తృప్తి దేశాయ్ కూడా మంగళవారం కోచ్చి చేరుకున్నారు. ఈ నగర విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన ఆమె.. శబరిమలలో ప్రార్థనలు చేసిన తరువాతే తాను కేరళనుంచి నిష్క్రమిస్తానని పేర్కొన్నారు. నా కదలికలపై నిఘా ఉందన్న విషయం నాకు తెలుసు.. అయినా అన్ని వయసుల మహిళలూ అయ్యప్ప గుడి ప్రవేశానికి అర్హులేనని సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పునిచ్చిన తరువాత కూడా కొన్ని హిందూ సంఘాలు వారిని నిలువరించడం ఏమిటి అని తృప్తి దేశాయ్ ప్రశ్నించారు. ఈమె వెంట మరో అయిదుగురు మహిళలున్నారు.
Shocking visuals of pepper/ chilli spray being sprayed at Bindu Ammini outisde the commissioner office by one of the protesters . She has been moved to the hospital. Six other women including Trupti Desai inside the police commissioner’s office. #Sabarimala #Kerala @ndtv pic.twitter.com/d24chgs8b3
— Sneha Koshy (@SnehaMKoshy) November 26, 2019