Karnataka Rain: దేశ వ్యాప్తంగా మండుటెండలు.. బెంగళూరులో మాత్రం సీన్ రివర్స్..

దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతుంటే బెంగళూర్‌లో భారీ వర్షం కురిసింది. వడగళ్ల వానతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గత కొద్దిరోజులుగా ఎండల తీవ్రతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న బెంగళూర్‌ వాసులు వాతావరణం..

Karnataka Rain: దేశ వ్యాప్తంగా మండుటెండలు.. బెంగళూరులో మాత్రం సీన్ రివర్స్..
Karnataka Rain

Updated on: May 01, 2022 | 6:19 PM

దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతుంటే బెంగళూర్‌లో భారీ వర్షం(Bengaluru Heavy Rain) కురిసింది. వడగళ్ల వానతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గత కొద్దిరోజులుగా ఎండల తీవ్రతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న బెంగళూర్‌ వాసులు వాతావరణం చల్లబడడంతో రిలీఫ్‌ పొందారు. మరో రెండు రోజుల పాటు బెంగళూర్‌లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. బెంగళూరు నగరంలోని పలు ప్రాంతాల్లో వరుణుడు బిజీబిజీగా ఉండడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మడివాల, కోరమంగళ, సర్జాపూర్‌ రోడ్లపై వడగళ్ల వాన కురియడంతో ద్విచక్రవాహనదారులు, రోడ్డు పక్కన వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షం కురుస్తుండడంతో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. వర్షంతో రోడ్లన్నీ జలమయమై రోడ్డుపై బైకులు రాకపోకలు సాగిస్తున్నారు.

కర్ణాటకలో మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉండేలా ఉంది. కర్ణాటకలోని చాలా ప్రాంతాల్లో వర్షం కంటే ఉరుములు, మెరుపులతో కూడిన గాలివానలు ఎక్కువ ఉన్నాయి. కర్ణాటకతో పాటు ఈశాన్య భారతంలోని చాలా రాష్ట్రాల్లో కూడా మెరుపులు, ఉరుములు, పిడుగులు పడే అవకాశం ఉంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్-మణిపూర్-మిజోరం-త్రిపురలో ఈరోజు తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ(IMD) హెచ్చరించింది.

అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, సిక్కింలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం మరియు త్రిపురలలో ఈరోజు ఉరుములు, పిడుగులు పడే అవకాశం ఉంది.

ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో, మే 4 , 7 మధ్య హీట్ వేవ్ ఏర్పడుతుంది. పంజాబ్, హర్యానా, ఢిల్లీలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న 4 రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.

ఇవి కూడా చదవండి: TS Congress: రణ రంగంగా మారిన ఉస్మానియా.. రాహుల్ పర్యటనకు అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన..

Students Fighting: విద్యార్థులా..! వీధి రౌడీలా..! కర్రలతో కొట్టుకున్న సీనియర్లు, జూనియర్లు..