యుద్ధ తేదీ ఖరారు అయిందా! భారత్ – పాకిస్తాన్ రెండింటి నుండి అందుతున్న సంకేతాలు!

భారతదేశం భీకర రూపం, త్రివిధ దళాల సన్నాహాలను చూస్తుంటే, ఎప్పుడైనా పాకిస్తాన్‌పై దాడి చేయగలదని అనిపిస్తుంది. మరోవైపు, ఉగ్రదాడి తర్వాత ఆంక్షలతో ఇప్పటికే సగం చచ్చిన పాకిస్తాన్, మరింత భయంతో వణికిపోతుంది. ప్రతిరోజు భయం నీడలో గడుపుతున్నారు పాకిస్తాన్ జనం. భారతదేశం ఏక్షణానైనా దాడి చేస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సరిహద్దు వెంబడి పాకిస్థాన్ సైన్యం కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతోంది.

యుద్ధ తేదీ ఖరారు అయిందా! భారత్ - పాకిస్తాన్ రెండింటి నుండి అందుతున్న సంకేతాలు!
Pm Modi And Shahbaz

Updated on: May 06, 2025 | 5:06 PM

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశ రక్తం మరిగిపోతోంది. పాకిస్తాన్‌పై నిరంతరం కఠిన చర్యలు తీసుకుంటోంది భారత్ సర్కార్. సింధు జల ఒప్పందం రద్దుతో మొదలైన ఆంక్షలు.. దౌత్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. వ్యాపార, వాణిజ్య, పోస్టల్ సేవలు మూసివేశారు. అయితే, ఈ చర్య అంతా ట్రైలర్ రూపంలో కనిపిస్తుంది. పాకిస్తాన్ పై ఇంకా అసలు దాడి జరగనేలేదు. ప్రధానమంత్రి మోదీ ఇందుకు సంబంధించి తాళపుచెవిని సైన్యానికి అప్పగించారు. భారతదేశం దూకుడు వైఖరి, పాకిస్తాన్ చర్యలను చూస్తుంటే, యుద్ధం ఖాయంగా కనిపిస్తుంది.

పాకిస్తాన్‌పై భారతదేశం దాడి చేస్తుందని దాని సన్నాహాలను బట్టి స్పష్టంగా తెలుస్తోంది. పాకిస్తాన్‌లో కూర్చున్న ప్రజలకు కూడా ఇది తెలుసు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ ఇటీవల సంచలన ప్రకటన చేశారు. రష్యాలో విజయ దినోత్సవం తర్వాత మే 10-11 తేదీల్లో భారతదేశం పాకిస్తాన్‌పై దాడి చేసే అవకాశం ఉందని ఆయన అన్నారు. దీంతో పాకిస్థానియుల్లో మరింత గుబులు రేపుతోంది. రష్యా మే 9వ తేదీన విజయ దినోత్సవం జరుపుకుంటుంది. దీనికి ప్రధానమంత్రి మోడీ హాజరు కావాల్సి ఉంది. కానీ పాకిస్తాన్‌తో ఉద్రిక్తత కారణంగా ఆయన పర్యటనను రద్దు చేసుకున్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రధాని స్థానంలో వెళ్లాల్సి ఉంది, కానీ ఆయన కూడా వెళ్లడం లేదు. భారత రక్షణ కార్యదర్శి ప్రధాని మోదీతో ప్రత్యేకంగా సమావేశమైన ప్రస్తుత పరిస్థితులు వివరించారు. ఈ పరిణామాలన్నింటిని పరిశీలిస్తే, ఎదో కీలక ఘట్టం చోటు చేసుకోబోతున్నట్లు అర్థమవుతోంది.

అబ్దుల్ బాసిత్ ప్రకటనతో పాటు, భారతదేశం సన్నాహాలు కూడా మే 10 లేదా 11 తేదీలలో పాకిస్తాన్‌పై దాడి చేయవచ్చని సూచిస్తున్నాయి. వాస్తవానికి, మే 7న, దేశంలోని 244 జిల్లాల్లో మాక్ డ్రిల్ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో, పౌరులకు యుద్ధ సమయంలో తమను తాము ఎలా రక్షించుకోవాలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. దేశప్రజలకు అవగాహన కల్పిస్తారు. ఈ కసరత్తు సమయంలో సైరన్ కూడా మోగుతుంది. ఇది 1971 తర్వాత మొదటిసారి జరుగుతుంది.

పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కూడా కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖపై భారతదేశం ఎప్పుడైనా సైనిక దాడి చేయవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. వార్తా సంస్థ పిటిఐ నివేదిక ప్రకారం, ఇస్లామాబాద్‌లో పాక్ మంత్రి మాట్లాడుతూ, భారతదేశం ఎప్పుడైనా నియంత్రణ రేఖపై దాడి చేయగలదని వార్తలు ఉన్నాయని అన్నారు. న్యూఢిల్లీకి తగిన సమాధానం ఇస్తామని బెదిరించారు. మరోవైపు సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకున్న పాకిస్థాన్, ఉగ్రదాడి తర్వాత నిత్యం సరిహద్దులో ఏదోక చోట కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతోంది పాకిస్థాన్. దీన్ని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది.

అయితే 1971లో భారత్-పాకిస్తాన్ యుద్ధానికి ముందు చివరిసారిగా ఇటువంటి మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ డ్రిల్ నిర్వహించిన నాలుగు రోజులకే రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైంది. తరువాత నవంబర్ చివరి వారంలో ఒక మాక్ డ్రిల్ నిర్వహించారు. డిసెంబర్ 3న యుద్ధం ప్రారంభమైంది. మాక్ డ్రిల్ కు ముందు, వైమానిక దళం ఉత్తరప్రదేశ్‌లోని గంగా ఎక్స్ ప్రెస్ వేపై ప్రాక్టీస్ నిర్వహించింది. దీనిలో యుద్ధ విమానాలు తమ బలాన్ని ప్రదర్శించాయి. వైమానిక దళం ఎక్స్‌ప్రెస్‌వేపై రెండు దశల్లో అపూర్వమైన సైనిక విన్యాసాలను నిర్వహించింది. ఇందులో, పగలు, రాత్రి రెండింటిలోనూ యుద్ధ విమానాలు ఎగరడం, ల్యాండింగ్, టేకాఫ్, తక్కువ ఎత్తులో ఎగరడం వంటి పోరాట పద్ధతులను ప్రదర్శించారు. రాత్రి 9 నుండి 10 గంటల మధ్య జరిగిన నైట్ ల్యాండింగ్ ఈ విన్యాసాలలో ముఖ్యాంశం, భారత వైమానిక దళం అత్యాధునిక సామర్థ్యాలను ప్రదర్శించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..