తాజ్ మహల్ రాత్రిపూట ఎందుకు ప్రకాశించదు..? చిన్న దీపం కూడా పెట్టరు.. ఆ రహస్యం ఇదేనట..!

ఆగ్రాలోని తాజ్ మహల్ లో రాత్రిపూట లైట్లు ఎప్పుడూ వెలిగించరు. ఇలా ఎందుకు చేస్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. సాధారణంగా అందరూ అనుకునేది ఏంటంటే.. తాజ్ మహల్ మార్బుల్ తో తయారు చేశారు. కాబట్టి, చంద్రుడి నుండి వచ్చే కాంతిలో తాజ్ మహల్ మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుందని, అందుకే తాజ్ మహల్ లో ప్రత్యేకంగా లైట్ అవసరం లేదని చాలామంది అనుకుంటారు. కానీ, అసలు కారణం మరొకటి ఉందట. అదేంటంటే..

తాజ్ మహల్ రాత్రిపూట ఎందుకు ప్రకాశించదు..? చిన్న దీపం కూడా పెట్టరు.. ఆ రహస్యం ఇదేనట..!
Night Viewing Of Taj Mahal in Agra

Updated on: Feb 19, 2025 | 4:39 PM

ప్రేమకు నిలువెత్తు నిదర్శనం తాజ్ మహల్. ప్రపంచంలోని 8 వింతలలో ఇది కూడా ఒకటి. తాజ్‌మహల్‌ అందాలను చూసేందుకు ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు వస్తుంటారు. ప్రతి నిత్యం తాజ్ మహల్ దగ్గర సందర్శకుల రద్దీ కొనసాగుతూ ఉంటుంది. అయితే, తాజ్‌మహల్‌ సందర్శించిన వారికి ఖచ్చితంగా ఓ డౌట్‌ వచ్చే ఉంటుంది.. అదేంటంటే.. తాజ్ మహల్ చుట్టూ లైట్స్ ఉండవని మీరేప్పుడైనా గమనించారా.? రాత్రిపూట తాజ్ మహల్ లో లైట్స్ వేయరట.. ఈ విషయం మీరు గమనించారా..? దాని వెనుక దాగివున్న రహస్యం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం…

దేశంలో జరిగే అన్ని పండుగలు, జాతీయ వేడుకల సమయంలో ఎర్రకోట, ఇతర చారిత్రక కట్టడాలన్నీ రంగు రంగుల విద్యుత్‌ దీపాలతో ప్రకాశిస్తుంటాయి.. కానీ, ఆగ్రాలోని తాజ్ మహల్ లో రాత్రిపూట లైట్లు ఎప్పుడూ వెలిగించరు. ఇలా ఎందుకు చేస్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. సాధారణంగా అందరూ అనుకునేది ఏంటంటే.. తాజ్ మహల్ మార్బుల్ తో తయారు చేశారు. కాబట్టి, చంద్రుడి నుండి వచ్చే కాంతిలో తాజ్ మహల్ మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుందని, అందుకే తాజ్ మహల్ లో ప్రత్యేకంగా లైట్ అవసరం లేదని చాలామంది అనుకుంటారు. కానీ, అసలు కారణం మరొకటి ఉందట. అదేంటంటే..

తాజ్ మహల్ లోపల, బయట లైట్లు వేయటం వల్ల పెద్ద సమస్యే ఉందంటున్నారు సంబంధిత వర్గాలు. తాజ్‌మహల్‌ లోపల, బయట లైట్స్ వేయడం వలన పురుగులు వస్తున్నాయని, అవి ఎక్కువగా తిరిగి పాడు చేస్తున్నాయని అంటున్నారు. తాజ్‌మహల్‌ నేలపై కీటకాలు చేసే మలినాల కారణంగా మార్బుల్ నేల రంగు మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. ఇప్పటికే తాజ్ మహల్ లో కొన్ని చోట్ల ఇలా పురుగుల వల్ల మార్బుల్ గ్రీన్ కలర్ లోకి మారిందని చెబుతున్నారు.. ఎంతో తెల్లగా ఉండే ఈ కట్టడం రానురాను కలర్ మారిపోతూ వస్తుంది. ఇంకా ఈ లైట్స్ వల్ల లేనిపోని పురుగుల వచ్చి పాడుచేసే ప్రమాదం లేకపోలేదు. అందుకే తాజ్‌మహల్‌ లోపల, బయట లైట్లు వేయటం నిషేధించారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: ఇది భారతదేశంలోని పురాతన రైల్వే స్టేషన్.. బ్రిటిష్ కాలంలో ప్రారంభం.. నేటికీ చెక్కుచెదరని అద్భుతం..!

ఇది కూడా చదవండి: వీళ్ల రీల్స్‌ పిచ్చి తగలేయా.. బర్త్‌డేను కాస్త డెత్‌ డేగా మార్చేట్టున్నారుగా.. కేక్‌ పేలటంతో..

ఇది కూడా చదవండి: మహా కుంభమేళాలో మంటలు.. 30 రోజుల్లో ఏడోసారి అగ్నిప్రమాదం..

ఇది కూడా చదవండి: మహా కుంభమేళాలో టీ అమ్మిన వ్యక్తి.. ఇప్పుడు లక్షాధికారి..! ఒక్కరోజు సంపాదన తెలిస్తే..

ఇది కూడా చదవండి: బంగారం కొనాలనుకుంటున్నారా.. చిన్న దుకాణంలో మంచిదా.. పెద్ద షోరూమ్‌లో బెటరా..?

ఇది కూడా చదవండి: ఇంటర్నెట్ లేకపోయినా యూట్యూబ్ చూడొచ్చు..! ఇవిగో సూపర్ ట్రిక్స్.. ఎంజాయ్‌ చేసేయండిలా..

ఇది కూడా చదవండి: ఏసీ కొనాలని చూస్తున్నారా.. అదిరిపోయే ఆఫర్ భయ్యా..ఇక్కడ భారీ తగ్గింపు..!

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..