First to Voter: స్వతంత్ర్యం భారత దేశంలో మొదటి ఓటు వేసిన శ్యామ్ శరణ్ నేగి.. తొలి ఓటరు ఎలా అయ్యారు..?

|

Nov 28, 2023 | 8:04 PM

ఏ దేశ ప్రభుత్వ ఎన్నికలకైనా ఓటింగ్ జరుగుతుంది. ఓటు వేయడాన్ని గొప్ప విధిగా భావిస్తారు. సామాన్యుల దగ్గర నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీల వరకు దేశంలో అత్యున్నత స్థానంలో ఉన్న రాష్ట్రపతి, ప్రధానమంత్రి వరకు ఓటు వేయాల్సింది. అందరూ ఓటు వేయాలని సాధారణ ప్రజలకు ప్రముఖులు విజ్ఞప్తి చేస్తుంటారు.

First to Voter: స్వతంత్ర్యం భారత దేశంలో మొదటి ఓటు వేసిన శ్యామ్ శరణ్ నేగి.. తొలి ఓటరు ఎలా అయ్యారు..?
First To Voter Shyam Saran Negi
Follow us on

ఏ దేశ ప్రభుత్వ ఎన్నికలకైనా ఓటింగ్ జరుగుతుంది. ఓటు వేయడాన్ని గొప్ప విధిగా భావిస్తారు. సామాన్యుల దగ్గర నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీల వరకు దేశంలో అత్యున్నత స్థానంలో ఉన్న రాష్ట్రపతి, ప్రధానమంత్రి వరకు ఓటు వేయాల్సింది. అందరూ ఓటు వేయాలని సాధారణ ప్రజలకు ప్రముఖులు విజ్ఞప్తి చేస్తుంటారు. దాని ప్రభావం బాగానే కనిపిస్తుంది. రికార్డు స్థాయిలో ఓటింగ్ జరిగినట్లు కొన్ని ప్రాంతాల నుంచి చాలాసార్లు వార్తలు వింటుంటాం. ఇటీవల జరిగిన పలు ఎన్నికల్లో ఓటింగ్ రికార్డులు బద్దలయ్యాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు మొదట ఓటు వేసిన వ్యక్తి ఎవరు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అంటే, దేశంలో మొదటి ఓటరు ఎవరో ఒకసారి తెలుసుకుందాం..

శ్యామ్ శరణ్ నేగి నేపథ్యం…

శ్యామ్ శరణ్ నేగి 1951 అక్టోబరు 25న మొదటిసారి ఓటు వేసి స్వతంత్ర భారతదేశపు మొదటి ఓటరు అయ్యారు. భారతదేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఫిబ్రవరి 1952లో మొదటి సాధారణ ఎన్నికలు జరిగాయి. శ్యామ్ శరణ్ నేగి జూలై 1917లో కిన్నౌర్‌లోని కల్పాలో జన్మించారు. అతను 10 సంవత్సరాల వయస్సులో పాఠశాలకు వెళ్ళారు. అక్కడ అతను ఐదవ తరగతి వరకు తన విద్యను పూర్తి చేశారు. దీని తరువాత, అతను తన చదువు కోసం రాంపూర్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రాంపూర్ చేరుకోవడానికి కాలినడకన మూడు రోజులు పట్టింది. రాంపూర్‌లో తొమ్మిదో తరగతి వరకు చదువు పూర్తి చేశారు. అయితే వయోభారం కారణంగా 10వ తరగతిలో ప్రవేశం లభించలేదు. శ్యామ్ శరణ్ నేగి 1940 నుండి 1946 వరకు ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో ఫారెస్ట్ గార్డ్‌గా పనిచేశారు. ఆపై విద్యా శాఖకు మారారు. కల్ప లోయర్ మిడిల్ స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించారు.

స్వతంత్ర భారత తొలి ఓటర్ ఇలా అయ్యారు!

1 జూలై 1917న కల్పాలో జన్మించిన శ్యామ్ శరణ్ నేగి, బ్రిటిష్ పాలన ముగిసిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో 25 అక్టోబర్ 1951న తన మొదటి ఓటు వేశారు. ఇది కల్ప గిరిజన జిల్లాలో భాగం. హిమపాతం కంటే ముందే ఓటింగ్ ప్రక్రియ జరిగింది. అందులో భాగంగానే శ్యామ్ శరణ్ నేగి తన ఓటు వేసిన మొదటి వ్యక్తి. దేశంలో మొదటి లోక్‌సభ ఎన్నికలు ఫిబ్రవరి 1952లో జరిగాయి. అయితే కిన్నౌర్‌లో విపరీతమైన హిమపాతం కారణంగా, ఎన్నికలు ఐదు నెలల ముందుగా సెప్టెంబర్ 1951లో జరిగాయి. ఆ సమయంలో శ్యామ్ శరణ్ నేగి కిన్నౌర్‌లోని మూరాంగ్ స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా ఉంటూ ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే ఉదయం ఓటు వేసి డ్యూటీకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఉదయాన్నే పోలింగ్ స్థలానికి చేరుకోగా, పోలింగ్ డ్యూటీ పార్టీ 6:15కి చేరుకుంది. నేగి అభ్యర్థన మేరకు, అతను ఓటు వేయడానికి అనుమతించారు ఎన్నికల సంఘం అధికారులు. తద్వారా స్వతంత్ర భారతదేశంలో మొదటి ఓటరు అయ్యారు శ్యామ్ శరణ్ నేగి.

చివరిసారిగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు

ఇదిలావుంటే 106 ఏళ్ల జీవితాన్ని గడిపిన శ్యామ్ శరణ్ నేగి, సార్వత్రిక ఎన్నికల్లో 34వ సారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. శ్యామ్ శరణ్ నేగి ఇటీవలె కన్నుమూశారు. ఇటీవల జరిగిన హిమాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…