Hemant Soren: భూకుంభకోణంలో జార్ఖండ్‌ సీఎంకు కష్టాలు.. ఈడీకి పంపిన మెయిల్‌లో సోరెన్ ఏం చెప్పారు?

భూకుంభకోణంలో జార్ఖండ్‌ సీఎం హేమంత్‌సోరెన్‌కు కష్టాలు రెట్టింపయ్యాయి. ఈడీ బృందం హేమంత్‌సోరెన్‌ను విచారించడానికి ఢిల్లీ శాంతినికేతన్‌ నివాసానికి చేరుకుంది. అయితే తన ఇంట్లో హేమంత్‌సోరెన్‌ లేకపోవడంతో ఈడీ బృందం షాక్‌కు గురయ్యింది. అయితే హేమంత్‌ సోరెన్‌ నివాసంలో ఈడీకి లేఖ లభించింది. ఈనెల 31వ తేదీన విచారణకు హాజరవుతానని లేఖలో పేర్కొన్నారు

Hemant Soren: భూకుంభకోణంలో జార్ఖండ్‌ సీఎంకు కష్టాలు.. ఈడీకి పంపిన మెయిల్‌లో సోరెన్ ఏం చెప్పారు?
Hemant Soren

Updated on: Jan 30, 2024 | 11:01 AM

భూకుంభకోణంలో జార్ఖండ్‌ సీఎం హేమంత్‌సోరెన్‌కు కష్టాలు రెట్టింపయ్యాయి. ఈడీ బృందం హేమంత్‌సోరెన్‌ను విచారించడానికి ఢిల్లీ శాంతినికేతన్‌ నివాసానికి చేరుకుంది. అయితే తన ఇంట్లో హేమంత్‌సోరెన్‌ లేకపోవడంతో ఈడీ బృందం షాక్‌కు గురయ్యింది. అయితే హేమంత్‌ సోరెన్‌ నివాసంలో ఈడీకి లేఖ లభించింది. ఈనెల 31వ తేదీన విచారణకు హాజరవుతానని లేఖలో పేర్కొన్నారు

మనీలాండరింగ్ కేసులో విచారణ నిమిత్తం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బృందం జనవరి 29న జార్ఖండ్ సిఎం హేమంత్ సోరెన్ ఢిల్లీ నివాసానికి చేరుకుంది. అక్కడ అతను కనపడలేదు. అయితే, ఈడీ స్క్వాడ్ 13 గంటలకు పైగా అక్కడే క్యాంప్ చేసి, నివాసంలో సోదాలు చేసింది. దర్యాప్తు బృందం జార్ఖండ్ సీఎం నివాసం నుంచి బీఎండబ్ల్యూ కారును స్వాధీనం చేసుకుంది. కొన్ని కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకుంది. దీంతో హేమంత్ సోరెన్ పరువు తీసేందుకు ప్రణాళికాబద్ధమైన కుట్రగా అభివర్ణించింది జార్ఖండ్ ముక్తి మోర్చా. అదే సమయంలో, అరెస్టు భయంతో సీఎం సోరెన్ 18 గంటలు పరారీలో ఉన్నారని బీజేపీ నేతలు ఎద్దేవా చేశారు

ఢిల్లీ పోలీసులతో పాటు ఈడీ బృందం సోమవారం ఉదయం 9 గంటలకు దక్షిణ ఢిల్లీలోని 5/1 శాంతి నికేతన్ భవన్‌కు చేరుకుంది. రాత్రి 10:30 గంటల వరకు అక్కడే ఉంది. అనంతరం ఈడీ అధికారులు రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ప్రాంగణం నుంచి బయటకు వెళ్లడం కనిపించింది. సీఎం సోరెన్ నివాసంలో బీఎండబ్ల్యూ కారు, కొన్ని పత్రాలను దర్యాప్తు సంస్థ స్వాధీనం చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఆదివారం రాత్రి వరకు ఢిల్లీ నివాసం లోనే ఉన్న హేమంత్‌సోరెన్‌ అదృశ్యం కావడం మిస్టరీగా మారింది. అయితే హేమంత్‌ సోరెన్‌ ఆచూకీ చిక్కిందని ఈడీ బృందాలు చెబుతున్నాయి. భూకుంభకోణంలో హేమంత్‌సోరెన్‌ను ఈడీ అరెస్ట్‌ చేస్తుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈడీ సమన్లపై న్యాయపోరాటం చేయాలని హేమంత్‌ సోరెన్‌ నిర్ణయించినట్టు తెలుస్తోంది . సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాదులు అభిషేక్‌ సింఘ్వీ, కపిల్‌సిబాల్‌తో ఆయన సంప్రదింపులు జరిపారు.

కాగా, ఈ ఘటన అంతా హేమంత్ సోరెన్ పరువు తీసేందుకు జరిగిన కుట్ర అని సీఎం సోరెన్ కుటుంబ సభ్యులు తెలిపారు. ఈడీకి హేమంత్ సోరెన్ నిరంతరం సమాధానమిస్తూనే ఉన్నారు. జనవరి 31న మధ్యాహ్నం ఒంటి గంటకు తన నివాసంలో తన వాంగ్మూలాన్ని నమోదు చేసుకోవాలని ఆయన చెప్పినట్లు JMM పార్టీ నేతలు చెప్పారు. జార్ఖండ్ సీఎం జనవరి 27న రాంచీ నుంచి ఢిల్లీకి వెళ్లారు. ఆయన వ్యక్తిగత పనుల నిమిత్తం వెళ్లారని, తిరిగి వస్తారని ఆయన పార్టీ జేఎంఎం తెలిపింది. అయితే, ఈడీ దాడులకు భయపడి ముఖ్యమంత్రి సోరెన్ గత 18 గంటలుగా పరారీలో ఉన్నారని బీజేపీ జార్ఖండ్ నేతలు ఆరోపించారు. ఈ సందర్భంగా, జార్ఖండ్ రాష్ట్ర ప్రతిష్ట ప్రమాదంలో ఉందని, ఈ విషయాన్ని గుర్తించాలని బీజేపీ నేతలు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కోరింది.

భూకుంభకోణం కేసులో సోరెన్‌ను జనవరి 20న రాంచీలోని అతని అధికారిక నివాసంలో ED ప్రశ్నించింది. జనవరి 29 లేదా జనవరి 31న విచారణకు హాజరవుతాడా లేదా అని చెప్పాలని కోరుతూ అతనికి తాజాగా సమన్లు ​​జారీ చేసింది. సీఎం సోరెన్ ఈడీకి లేఖ పంపారు. కానీ విచారణకు రోజు లేదా తేదీని పేర్కొనలేదు. జనవరి 28న EDకి పంపిన ఈ-మెయిల్‌లో, రాష్ట్ర ప్రభుత్వ పనితీరును అడ్డుకోవడానికి రాజకీయ ఎజెండాతో ఇది ప్రేరేపించబడిందని సోరెన్ ఆరోపించాడు. జనవరి 31 లేదా అంతకంటే ముందు తన స్టేట్‌మెంట్‌ను తిరిగి రికార్డ్ చేస్తామని పేర్కొన్నాడు. ED మొండితనం దాని చెడు సంకల్పాన్ని చూపుతుందని మండిపడ్డారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…