దారికి అడ్డంగా స్పీడ్ బ్రేకర్ లా ఓ భారీ కొండ చిలువ కనబడితే ఏం చేస్తాం ? భయంతో ఆ పైథాన్ ని దాటి వెళ్లగలుగుతామా ? దాడికి రెడీగా ఉన్నట్టున్న ఆ పైథాన్ ని చూసి హడలెత్తి వెనక్కి పరుగు లంకించుకొంటాం.. మళ్ళీ తిరిగి చూసే ధైర్యమే ఉండదు. అసలు మొదట ఏం చేయాలో తోచనే తోచదు కూడా..మరి జంతువులు మాత్రం అలా ప్రవర్తిస్తాయంటే వాటిలోనూ భయమున్న కారణంగానే.. కర్నాటకలోని నాగర్ హోల్ నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్ లోకి ఒక్కసారి కాలు పెడదాం.. వన్యప్రాణుల సంరక్షణా కేంద్రమైన ఈ జంతువుల ‘పార్క్’ లో తన మానాన తాను వెళ్తున్న పులికి దారికి అడ్డంగా ఓ భారీ కొండచిలువ కనిపించింది. పులి తలచుకుంటే దానితో ఫైట్ చేయగలదు కూడా.. దాని తోక భాగాన్ని తన పదునైన కోరలతోపట్టుకుని చీల్చి చెండాడగలదు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఆ పైథాన్ ని చూసిన పులి కొద్దిసేపు షాక్ తిని అక్కడే ఉండిపోయింది. ఏం చేయాలో దానికి తోచలేదు. దాని దగ్గరే తచ్చాడింది. దానిపై ఎటాక్ చేయాలా ? లేక తోక ముడవాలా ? అని ఆలోచించినట్టు కనబడింది. కొండచిలువపై దాడి చేయాలనుకునే లోపు అది ఒక్కసారిగా పులిపైనే ఎటాక్ కి యత్నించింది. దీంతో భయపడిన పులి వెనక్కు..పొదలవైపు మళ్లింది. మళ్ళీ తిరిగి వచ్చి భయంకర సర్పం దగ్గరకు వచ్చి… తిరిగి వెనక్కి మళ్లింది. సుమారు 15 నిముషాల సేపు ఈ ‘దాగుడుమూతలు’ సాగాయి. మొత్తానికి ఎంతటి క్రూర జంతువుకైనా భయం అన్నది తప్పదని తెలుస్తోంది.
ఇండియన్ ఫారెస్ట్ ఆఫీస సుశాంత్ నందా ఈ వీడియోను తన ట్విటర్ లో షేర్ చేశారు. అంతకుముందు నేచురలిస్ట్ శరత్ అబ్రహం కబిని రిసార్ట్స్ వద్ద ఈ క్లిప్ తీశారు. 2018 నాటిదైనా ఈ వీడియో ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.
Tiger leaves the way to Python.. pic.twitter.com/87nGHbo0M0
— Susanta Nanda IFS (@susantananda3) July 21, 2020
మరిన్ని చదవండి ఇక్కడ : సీఎం జగన్ కు… తాగుబోతుల విన్నపం ..!వైరల్ అవుతున్న లెటర్.: drunkards request CM Jagan Video