Kolkata: కోల్‌కతా హత్యాచార ఘటనపై సుప్రీం సంచలన వ్యాఖ్యలు.. అలా ఎలా చేస్తారంటూ..

దేశవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీం కోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. ఇందులో భాగంగానే మంగళవారం విచారణ చేపట్టి సుప్రీం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటనపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారు తీరును సుప్రీం ధర్మాసనం తీవ్రంగా ఖండించింది. మెడికల్ ప్రిన్సిల్‌ తీరుపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది...

Kolkata: కోల్‌కతా హత్యాచార ఘటనపై సుప్రీం సంచలన వ్యాఖ్యలు.. అలా ఎలా చేస్తారంటూ..
Supreme Court
Follow us

|

Updated on: Aug 20, 2024 | 12:36 PM

కోల్‌కతా వైద్యురాలి హత్యాచార, హత్య ఘటనపై దేశం మొత్తం ఆగ్రహిస్తున్న విషయం తెలిసిందే. ఈ దారుణ సంఘటనపై దేశ ప్రజలంతా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. దారుణానికి ఒడిగట్టిన వారిని అత్యంత కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం సీబీఐ ఈ కేసును విచారిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బాధితురాలి తండ్రి ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారిన విషయం విధితమే.

దేశవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీం కోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. ఇందులో భాగంగానే మంగళవారం విచారణ చేపట్టి సుప్రీం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటనపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారు తీరును సుప్రీం ధర్మాసనం తీవ్రంగా ఖండించింది. మెడికల్ ప్రిన్సిల్‌ తీరుపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. నేరాన్ని ఉదయాన్నే గుర్తించినట్లు తెలిసినా.. ప్రిన్సిపల్ ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని కోర్టు వ్యాఖ్యానించింది.

ప్రిన్సిపల్ ప్రవర్తనపై అనుమాలు ఉన్నా.. అతడిని వెంటనే మరో కాలేజీకి ఎలా నియమించారని సీజేఐ జస్టిస్ డి.వై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. ఇక ఎఫ్‌ఐఆర్‌ నమోదు కూడా ఆలస్యమైంది. మృతదేహాన్ని అంత్యక్రియలకు అప్పగించిన మూడు గంటల తర్వాత రాత్రి 11.45 గంటలకు ఎందుకు నమోదు చేయాల్సి వచ్చింది? ఆసుపత్రి అధికారులు, కోల్‌కతా పోలీసులు అప్పటిదాకా ఏం చేస్తున్నారు అంటూ ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది.

ఇక పలు మీడియా సంస్థల తీరుపై కూడా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితురాలి ఫొటో, పేరును ఎలా ప్రచురిస్తారంటూ ప్రశ్నించింది. అలాగే వ్యవస్థలో ఉన్న కొన్ని లోపలపై కూడా ధర్మాసం పలు కీలక ప్రశ్నలను సంధించింది. మహిళలు ఉద్యోగాలకు వెళ్లే పరిస్థితి లేకపోతే.. పనిచేసే ప్రదేశంలో భద్రత లేకపోతే వారికి మనం సమానత్వాన్ని నిరాకరిస్తున్నట్లేనని కోర్టు అభిప్రాయపడింది. ప్రస్తుత రోజుల్లో చాలా మంది యంగ్‌ డాక్టర్లు 36 గంటలు ఏకధాటిగా పనిచేస్తున్నారు. వారికి పని ప్రదేశంలో భద్రత కల్పించడం కోసం ఓ జాతీయ ప్రొటోకాల్‌ను రూపొందించడం అత్యవసరమని కోర్టు వెల్లడించింది. ఇందుకోసం వెంటే ఓ జాతీయ టాస్క్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో హైదరాబాద్‌కు చెందిన ఏషియన్‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ నేషనల్‌ గ్యాస్ట్రాలజీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డి, సర్జన్‌ వైస్‌ అడ్మిరల్‌ ఆరే సరిన్‌ తదితరులు సభ్యులుగా ఉంటారని ధర్మాసనం తెలిపింది. రెండు వారాల్లోపు మధ్యంతర నివేదిక సమర్పించాలని నేషనల్‌ టాస్క్‌ఫోర్స్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. మరోవైపు డాక్టర్ల విధుల బహిష్కరణతో చాలా మంది రోగులు ఇబ్బందిపడుతున్నారని, తక్షణమే తమ నిరసనలు విరమించాలని డాక్టర్లకు సుప్రీంకోర్టు విజ్ఞప్తి చేసింది.  అనంతరం ఈ విచారణను సుప్రీంకోర్టు గురువారానికి వాయిదా వేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

కోల్‌కతా హత్యాచార ఘటనపై సుప్రీం సంచలన వ్యాఖ్యలు..
కోల్‌కతా హత్యాచార ఘటనపై సుప్రీం సంచలన వ్యాఖ్యలు..
రాయల్ ఎన్‌ఫీల్డ్ పోటీగా మహీంద్రా ‘గోల్డ్ స్టార్’..
రాయల్ ఎన్‌ఫీల్డ్ పోటీగా మహీంద్రా ‘గోల్డ్ స్టార్’..
'వినేశ్‌కు రూ.16 కోట్ల ప్రైజ్‌ మనీ ఇచ్చారా? అదొక చీప్‌ పబ్లిసిటీ'
'వినేశ్‌కు రూ.16 కోట్ల ప్రైజ్‌ మనీ ఇచ్చారా? అదొక చీప్‌ పబ్లిసిటీ'
ఇంట్లో గుడ్లగూబ విగ్రహాన్ని ఎక్కడ పెట్టుకోవడం శుభప్రదం అంటే..
ఇంట్లో గుడ్లగూబ విగ్రహాన్ని ఎక్కడ పెట్టుకోవడం శుభప్రదం అంటే..
అమ్మ పక్కన అమాయకంగా ఉన్న ఈ చిన్నోడు.. ఇప్పుడు తోపు యాక్టర్..
అమ్మ పక్కన అమాయకంగా ఉన్న ఈ చిన్నోడు.. ఇప్పుడు తోపు యాక్టర్..
వీర జవాన్ విగ్రహానికి రాఖీ కట్టిన మహిళలు..
వీర జవాన్ విగ్రహానికి రాఖీ కట్టిన మహిళలు..
క్రెడిట్ కార్డుపై రుణం తీసుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి..
క్రెడిట్ కార్డుపై రుణం తీసుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి..
నాగ చైతన్య- శోభిత వైవాహిక బంధంపై మరో జ్యోతిష్యుడి సంచలన జోస్యం
నాగ చైతన్య- శోభిత వైవాహిక బంధంపై మరో జ్యోతిష్యుడి సంచలన జోస్యం
బైక్‌తో సహా వరదలో కొట్టుకుపోయిన వ్యక్తి!
బైక్‌తో సహా వరదలో కొట్టుకుపోయిన వ్యక్తి!
అక్కడ 832 ఏళ్లుగా రాఖీపండగ జరుపుకోరు రీజన్ తెలిస్తే కన్నీరు ఆగదు
అక్కడ 832 ఏళ్లుగా రాఖీపండగ జరుపుకోరు రీజన్ తెలిస్తే కన్నీరు ఆగదు