అరటి పండ్లు త్వరగా పాడైపోతున్నాయా? ఇలా దాచేస్తే నెల రోజులైనా ఫ్రెష్‌గానే
20 August 2024
TV9 Telugu
TV9 Telugu
పసివాళ్ల నుంచి పండు ముదుసలి వరకూ సులభంగా తినగలిగే పోషకఫలం అరటి.. శుభకార్యాల్లోనూ పూజల్లోనూ నైవేద్యంగా ప్రసాదంగా పంచే పవిత్ర ఫలం కూడా అరటే
TV9 Telugu
రుచితోపాటు.. దీనిలో పోషకాలు కూడా మెండే. అందుకే చాలా మంది అరటిపండ్లను ఇష్టంగా తింటారు. తిన్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. గుండె జబ్బులను రానివ్వదు. మనసుకు ఆహ్లాదం కలిగించి, జ్ఞాపకశక్తిని పెంచుతుంది
TV9 Telugu
అయితే ఈ పండ్లను ఎక్కువ కాలం తాజాగా ఉంచలేం. మార్కెట్ నుంచి తీసుకొచ్చిన 3 రోజులకే అరటిపండ్లు నల్లగా మారుతాయి. ఆ తర్వాత వేగంగా కుళ్ళిపోతాయి
TV9 Telugu
అరటిపండ్లను ఎక్కువ కాలం తాజాగా ఉంచాలంటే ఈ కింది చిట్కాలు పాటిస్టే సరి. అరటిపండ్లను తాజాగా ఉంచడానికి సులువైన మార్గం వాటిని ప్లాస్టిక్‌లో చుట్టడం
TV9 Telugu
అలాగే అరటిపండ్లను తెల్లటి ప్లాస్టిక్‌లో బాగా చుట్టి ఉంచితే ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. లేదంటే అరటిపండును అల్యూమినియం ఫాయిల్‌లో కూడా చుట్టవచ్చు
TV9 Telugu
అరటిపండుపై నిమ్మరసం రాస్తే 10 రోజుల వరకు తాజాగా ఉంటాయి. ఒకేసారి అరటిపండ్లను కొనుగోలు చేస్తే, వాటిని కప్పి ఉంచకుండా ఆరుబయట ఉంచాలి. కప్పి ఉంచితే అరటి పండ్లు త్వరగా మగ్గిపోతాయ్
TV9 Telugu
అరటిపండుపై నిమ్మరసం రాస్తే 10 రోజుల వరకు తాజాగా ఉంటాయి. ఒకేసారి అరటిపండ్లను కొనుగోలు చేస్తే, వాటిని కప్పి ఉంచకుండా ఆరుబయట ఉంచాలి. కప్పి ఉంచితే అరటి పండ్లు త్వరగా మగ్గిపోతాయ్
TV9 Telugu
తీవ్రమైన వేడిలో ఎక్కువ కాలం అరటి పండ్లను తాజాగా ఉంచాలనుకుంటే, గాలి చొరబడని కంటైనర్‌లో ఉంచి డీప్ ఫ్రీజర్‌లో దాచేస్తే సరి. ఇలా చేస్తే నెలైనా తాజాగానే ఉంటాయి