WB SSC Scam: అర్పితా ముఖర్జీకి చెందిన నాలుగు లగ్జరీ కార్లు మిస్సింగ్‌.. భారీ మొత్తంలో నగదు పెట్టి ఉంటారని అనుమానం

నటి మంత్రి పార్థ ఛటర్జీ స్నేహితురాలు అర్పిత రెండు ఇళ్లలో ఈడీ సోదాల్లో 50 కోట్ల క్యాష్‌, 5 కిలోల బంగారం బయటపడిన సంగతి తెలిసిందే. మరోవైపు, కోర్టు సూచన ప్రకారం అర్పితను హెల్త్ చెకప్ కోసం కోల్‌కతాలో ఆస్పత్రికి తీసుకెళ్లారు అధికారులు. ఆ సమయంలో బోరున విలపించారు

WB SSC Scam: అర్పితా ముఖర్జీకి చెందిన నాలుగు లగ్జరీ కార్లు మిస్సింగ్‌.. భారీ మొత్తంలో నగదు పెట్టి ఉంటారని అనుమానం
Arpita Mukherjee
Follow us

|

Updated on: Jul 30, 2022 | 8:32 AM

WB SSC Scam: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది పశ్చిమ బెంగాల్ లోని(west Bengal) స్కూల్ సర్వీస్ కమిషన్ కుంభకోణం. ఈ  బెంగాల్‌ SSC స్కామ్‌పై ఈడీ దర్యాప్తు దూకుడుగా  కొనసాగుతోంది. అరెస్టయిన టీఎంసీ నేత (TMC), మాజీ మంత్రి పార్థా ఛటర్జీ ఫ్రెండ్‌ అర్పిత ముఖర్జీ నివాసాలపై ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. అర్పిత నివాసం నుంచి నాలుగు లగ్జరీ కార్లు మిస్సయినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. వాటి కోసం సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంతో గాలిస్తున్నారు. ఈడీ దాడుల కంటే ముందే కార్లను ఇతర ప్రాంతాలకు తరలించినట్టు తెలుస్తోంది. కార్ల‌లో భారీ మొత్తంలో న‌గ‌దు దాచిపెట్టి ఉంటార‌ని తెలుస్తోంది. అర్పితను అరెస్ట్‌ చేసినప్పుడే ఆమెకు చెందిన ఓ వైట్‌ మెర్సిడెస్‌ కారును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే అర్పితకు మరో బెంజ్‌తో పాటు ఆడీ ఏ4, హోండా సిటీ, హోండా సీఆర్వీ కార్లు కూడా ఉన్నాయి. ఇవే ఇప్పుడు కనిపించడం లేదు.

నటి మంత్రి స్నేహితురాలు అర్పిత రెండు ఇళ్లలో ఈడీ సోదాల్లో 50 కోట్ల క్యాష్‌, 5 కిలోల బంగారం బయటపడిన సంగతి తెలిసిందే. మరోవైపు, కోర్టు సూచన ప్రకారం అర్పితను హెల్త్ చెకప్ కోసం కోల్‌కతాలో ఆస్పత్రికి తీసుకెళ్లారు అధికారులు. ఆ సమయంలో బోరున విలపించారు. కారు దిగడానికి ఆమె నిరాకరించారు. భద్రతా సిబ్బంది ఆమెను బలవంతంగా కారులోంచి దించి, ఆస్పత్రిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయినా ఆమె అధికారులకు సహకరించలేదు. ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్ దగ్గర రోడ్డుపై కూర్చుండిపోయింది. ఆమె ఎంతకీ లేవకపోవడంతో వీల్ చైర్ తెచ్చి అందులో కూర్చోబెట్టి అర్పితా ముఖర్జీని లోపలికి తీసుకెళ్లారు. పార్థ ఛటర్జీని కూడా హెల్త్‌ చెకప్‌ కోసం హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. పొలిటికల్‌గా సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన ఈ కేసు విషయంలో నోరు విప్పారు పార్థ. కొందరు కుట్ర పన్ని తనను ఇరికించారని ఆయన చెబుతున్నారు. పార్థ 2016లో విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు టీచర్లు, స్టాఫ్‌ నియమకాల్లో లంచాలు తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇప్పుడు కోట్ల రూపాయల స్కాంలో దొరికిపోయిన పార్థ దగ్గర పదేళ్ల క్రితం ఉన్న క్యాష్‌ కేవలం 6,300 రూపాయలేనట. 2011 ఎన్నికల్లో ఫైల్‌ చేసిన అఫిడవిట్‌లో ఇదే రాశారు పార్థ.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో