ఘోర ప్రమాదం.. ట్రక్కును ఢీకొట్టిన బస్సు.. 10మంది యాత్రికులు మృతి, 35మందికి సీరియస్

స్వాతంత్ర్య దినోత్సవం వేళ పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బర్ధమాన్ జిల్లాలో ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో 10 మంది మరణించారు. చాలా మంది ప్రయాణికులు గాయపడ్డారు. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును వేగంగా వచ్చిన ఒక ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. బస్సు ట్రక్కును వెనుక నుండి ఢీకొట్టడం ప్రయాణికులు చెల్లాచెదురయ్యారు.

ఘోర ప్రమాదం.. ట్రక్కును ఢీకొట్టిన బస్సు.. 10మంది యాత్రికులు మృతి, 35మందికి సీరియస్
West Bengal Road Accident

Updated on: Aug 15, 2025 | 12:55 PM

స్వాతంత్ర్య దినోత్సవం వేళ పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బర్ధమాన్ జిల్లాలో ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో 10 మంది మరణించారు. చాలా మంది ప్రయాణికులు గాయపడ్డారు. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును వేగంగా వచ్చిన ఒక ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. బస్సు ట్రక్కును వెనుక నుండి ఢీకొట్టడం ప్రయాణికులు చెల్లాచెదురయ్యారు. ఈ ప్రమాదం చాలా భయంకరంగా ఉండటంతో కొంతమంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

ప్రమాదానికి గురైన యాత్రికులు బీహార్‌కు చెందినవారుగా గుర్తించారు. దక్షిణ 24 పరగణాలలోని గంగాసాగర్‌ను సందర్శించిన తర్వాత యాత్రికులు బీహార్‌లోని తూర్పు చంపారన్ జిల్లాలోని మోతీహారికి తిరిగి వస్తుండగా పుర్బా బర్ధమాన్ జిల్లాలోని ఫగుయ్‌పూర్ సమీపంలోని జాతీయ రహదారి -19 వద్ద ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.

మృతుల్లో ఎనిమిది మంది పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లుగా గుర్తించారు. ఆరుగురు పిల్లలు సహా గాయపడిన వారిని బుర్ద్వాన్ మెడికల్ కాలేజీ మరియు ఆసుపత్రిలో చేర్చినట్లు అధికారులు తెలిపారు.”లగ్జరీ బస్సులో 45 మంది ఉన్నారు. వారి కుటుంబాలను సంప్రదించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి” అని పోలీస్ అధికారి తెలిపారు. యాత్రికులు ఆగస్టు 8న మోతీహారి నుండి తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. వారు మొదట డియోఘర్‌ను సందర్శించి, తరువాత గంగాసాగర్‌కు వెళ్లినట్లు సమాచారం.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..