బార్డర్‌లో అరుదైన పక్షుల పట్టివేత

| Edited By:

Aug 12, 2020 | 10:51 PM

సరిహద్దు నుంచి మన దేశంలోని పలు అరుదైన పక్షులను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాకు బీఎస్‌ఎఫ్‌ చెక్ పెట్టింది. బార్డర్‌ నుంచి మన దేశంలోకి అక్రమంగా చిలుకల వంటి పలు అరుదైన పక్షులను రవాణా..

బార్డర్‌లో అరుదైన పక్షుల పట్టివేత
Follow us on

సరిహద్దు నుంచి మన దేశంలోని పలు అరుదైన పక్షులను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాకు బీఎస్‌ఎఫ్‌ చెక్ పెట్టింది. బార్డర్‌ నుంచి మన దేశంలోకి అక్రమంగా చిలుకల వంటి పలు అరుదైన పక్షులను రవాణా చేస్తున్న స్మగ్లర్లను మంగళవారం రాత్రి పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 36 పక్షులను స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్ బెంగాల్‌లోని బారాన్‌బెరియా సరిహద్దులోని ఔట్‌ పోస్ట్‌ వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. స్వాధీనం చేసుకున్న పక్షులను రణఘాట్ ఫారెస్ట్ ఆఫీస్‌లో అందజేశారు. ఘటనపై కేసు నమోదు చేసి స్మగ్లర్లను అరెస్ట్ చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

Read More :

ఆస్పత్రి మెడికల్‌ షాపులో అగ్నిప్రమాదం.. కరోనా రోగుల తరలింపు

శివసేన గూటికి స్వతంత్ర ఎమ్మెల్యే