Home Theatre Explosion: నవ వరుడి మృతి కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. వెలుగులోకి సంచలన నిజం..

పెళ్లికి బహుమతిగా వచ్చిన హోం థియేటర్‌ పేలి నవ వరుడు మృతిచెందిన ఘటనలో ఊహించని ట్విస్ట్ బయటపడింది. తనను కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో వధువు మాజీ ప్రియుడే హోం థియేటర్‌లో బాంబు పెట్టి గిఫ్ట్‌గా ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో..

Home Theatre Explosion: నవ వరుడి మృతి కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. వెలుగులోకి సంచలన నిజం..
Home Theatre Explosion

Updated on: Apr 05, 2023 | 11:28 AM

పెళ్లికి బహుమతిగా వచ్చిన హోం థియేటర్‌ పేలి నవ వరుడు మృతిచెందిన ఘటనలో ఊహించని ట్విస్ట్ బయటపడింది. తనను కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో వధువు మాజీ ప్రియుడే హోం థియేటర్‌లో బాంబు పెట్టి గిఫ్ట్‌గా ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. నిందితుడిని పోలీసులు మంగళవారం (ఏప్రిల్‌ 4) అరెస్టు చేసి జైలుకు పంపారు. అసలేంజరిగిందంటే..

ఛత్తీస్‌గఢ్‌లోని కబీర్‌ధామ్‌ జిల్లా చమరి గ్రామానికి చెందిన హేమేంద్ర మేరవికి పొరుగూరికి చెందిన ఓ యువతితో మార్చి 31న వివాహం జరిగింది. పెళ్లికి వచ్చిన బహుమతుల్లో హోం థియేటర్‌ బహుమతిగా వచ్చింది. ఏప్రిల్‌ 2వ తేదీన హేమేంద్ర హోం థియేటర్‌ను బయటకు తీసి విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వగానే అది పేలిపోయింది. ఈ ఘటనలో హేమేంద్ర అక్కడికక్కడే మృతిచెందాడు. వరుడి అన్న రాజ్‌కుమార్‌తోపాటు ఇతర కుటుంబసభ్యులు తీవ్రంగా గాయపడటంతో సమీపంలోని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. చికిత్స పొందుతూ రాజ్‌కుమార్‌ కూడా మరణించాడు. ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు సంఘటన స్థలంలో గన్‌పౌడర్‌ను గుర్తించారు. దీంతో ఆ గిఫ్ట్‌ ఎవరు ఇచ్చారనే విషయంపై ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. వధువు మాజీ ప్రియుడు నిందితుడిగా పోలీసుల విచారణలో బయటపడింది.

అప్పటికే పెళ్లైన సర్జు అనే వ్యక్తి తన వివాహ విషయాన్నిదాచి యువతితో ప్రేమ వ్యవహారం నడిపాడు. ఇంతలో హేమేంద్రలో పెళ్లి నిశ్చయంకాగానే సదరు యువతి సర్జుని దూరం పెట్టింది. దీంతో కక్ష పెంచుకున్న సర్జు కొత్తదంపతులను చంపేందుకు ప్లాన్‌ వేశాడు. వారిని చంపేందుకు హోం థియేటర్‌లో బాంబు పెట్టి దంపతులకు గిఫ్ట్‌గా ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితుడిని అరెస్టు చేసి విచారించగా నేరం అంగీకరించినట్లు ఓ పోలీసధికారి మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.