వీడిన సస్పెన్స్…… ప్రధాని మోదీతో అఖిలపక్ష సమావేశానికి హాజరవుతాం……ఫరూక్ అబ్దుల్లా , మెహబూబా ముఫ్తీ

జమ్మూ కాశ్మీర్ పై ప్రధాని మోదీ ఈ నెల 24 న ఢిల్లీలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి హాజరవుతామని జమ్మూ కాశ్మీర్ గుప్ కార్ అలయెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా ప్రకటించారు.

వీడిన సస్పెన్స్...... ప్రధాని మోదీతో అఖిలపక్ష సమావేశానికి హాజరవుతాం......ఫరూక్ అబ్దుల్లా , మెహబూబా ముఫ్తీ
Mehbooba Mufti
Follow us

| Edited By: Phani CH

Updated on: Jun 22, 2021 | 4:22 PM

జమ్మూ కాశ్మీర్ పై ప్రధాని మోదీ ఈ నెల 24 న ఢిల్లీలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి హాజరవుతామని జమ్మూ కాశ్మీర్ గుప్ కార్ అలయెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా ప్రకటించారు. బహుశా కాశ్మీర్ కు ప్రత్యేక హోదా లేక రాష్ట్ర ప్రతిపత్తిని కల్పించడానికి గల అవకాశాలపై చర్చించేందుకు మోదీ ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారని మొదట వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతానికి కేంద్రానికి ఆ యోచన లేదని, కాశ్మీర్ లోని నియోజకవర్గాల పునర్వర్గీకరణ పై చర్చించడానికే ఆయన ఈ మీటింగ్ నిర్వహిస్తున్నారని తాజా సమాచారం తెలిపింది. ప్ప్రధాని ఆహ్వానంపై పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ , ఫరూక్ అబ్దుల్లా తదితర నేతలు రెండు రోజులపాటు చర్చలు జరిపారు. పీపుల్స్ అలయెన్స్ ఫర్ గుప్ కార్ అలయెన్స్ లో ఏడు పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. పీఎం మీటింగ్ కి వీరు హాజరవుతారా లేదా అన్న అంశంపై నెలకొన్న సస్పెన్స్ వీడింది. జమ్మూ కాశ్మీర్ కి ప్రత్యేక ప్రతిపత్తి, రాష్ట్ర హోదా కూడా ఇవ్వాలన్న తమ డిమాండును ఈ సందర్భంగా ఈ సమావేశం ముందు ఉంచుతామని మెహబూబా ముఫ్తీ తెలిపారు.

కేవలం ఈ డిమాండుతోనే గుప్ కార్ అలయెన్స్ ఏర్పడిందన్న విషయాన్ని విస్మరించరాదని ఆమె చెప్పారు. 370, 35 ఏ అధికరణాల విషయంలో తాము రాజీకి వచ్చేది లేదని అలయెన్స్ సభ్యుడు ముజఫర్ షా తెలిపారు. 2019 నుంచి జమ్మూ కాశ్మీర్ లో రాజకీయ ప్రక్రియ నిలిచిపోయింది. ఆ ఏడాది ఆగస్టు లో 370 అధికరణాన్ని రద్దు చేసి..కేంద్రం జమ్మూ కాశ్మీర్ ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. అప్పటి నుంచి పలువురు నేతలను రాజకీయ నిర్బంధంలో ఉంచింది. కాగా గత డిసెంబరులో అక్కడ జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గుప్ కార్ అలయెన్స్ 100 సీట్లు గెలుచుకోగా.. బీజేపీ 74 సీట్లు గెలిచి ఏకైక అతి పెద్ద పార్టీగా అవతరించింది.

మరిన్ని ఇక్కడ చూడండి: Yadadri Temple: విద్యుత్ దీపాలాంకరణలో యాదాద్రి ధగధగ.. శిల్పక‌ళ అద్భుతాన్ని కెమెరాలో బంధించిన ఎంపీ సంతోష్‌కుమార్

Aadi Saikumar: ఆది కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. హీరోయిన్‏గా ఆర్ఎక్స్ 100 బ్యూటీ..

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో