Anti-Ship Missile: ఎప్పుడైనా.. ఎక్కడైనా మేం సిద్ధం.. యాంటీ షిప్‌ మిసైల్స్‌ను పరీక్షించిన ఇండియన్‌ నేవీ!

హల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు భారత్‌ నౌకాదళం స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా అరేబియా సముద్రంలో యాంటీ-షిప్ మిసైల్ ప్రయోగాన్ని విజయవంతంగా పరీక్షించింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది.

Anti-Ship Missile: ఎప్పుడైనా.. ఎక్కడైనా మేం సిద్ధం.. యాంటీ షిప్‌ మిసైల్స్‌ను పరీక్షించిన ఇండియన్‌ నేవీ!
Anti Ship Missile

Updated on: Apr 27, 2025 | 3:27 PM

పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి. ప్యాక్‌ వ్యతిరేకంగా భారత్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక ఒప్పందాలను కూడా రద్దు చేసింది. ఈ నేపథ్యంలో భారత దళాలను రెచ్చగొట్టే విధంగా పాక్‌ ప్రయత్నాలను సాగిస్తోంది. దీంతో సరిహద్దుల్లో సైనికులు అలర్ట్ అయ్యాయి. అయితే దాయాదీ దేశం ఏలాంటి ఎత్తులతో వచ్చినా ధీటుగా సమాధానమిచ్చేందుకు భారత్ త్రివిద దళాలు అప్రమత్తమవుతున్నాయి. ఈ క్రమంలో భారత నౌకాదళం అరేబియా సముద్రంలో యాంటీ-షిప్ మిసైల్ ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించింది. యుద్ధ సన్నద్ధతలో భాగంగా అరేబియా సముద్రంలో యుద్ధ నౌకల నుంచి సుదీర్ఘ దూరాన లక్ష్యాలను ఖచ్చితంగా చేధించిది. దేశ ప్రయోజనాలను కాపాడేందుకు భారత నౌకాదళం యుద్ధానికి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా నేవీ స్పష్టం చేసింది. అరేబియా సముద్రం మధ్యలో యుద్ధనౌకల నుంచి చేపట్టిన బ్రహ్మోస్ యాంటీ-షిప్, యాంటీ-సర్ఫేస్ క్రూయిజ్ క్షిపణి ప్రయోగాలకు సంబంధించిన దృశ్యాలను ఇండియన్‌ నేవీ సోషల్‌ మీడియా వేదికగా  పంచుకుంది.

పాకిస్థాన్‌ చేసే దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు తాము సిద్ధమవుతున్నట్టు చూపించేందుకు భారత్‌ ఈ క్షిపణి ప్రయోగాన్ని చేపట్టింది. సముద్రజలాల్లో ఎప్పుడైనా, ఎక్కడైనా భారత ప్రయోజనాలను కాపాడేందుకు తాము సిద్దంగా ఉన్నట్టు ఇండియన్‌ నేవీ తెలిపింది . ఇదే కాకుండా ఇండియన్ నేవీ ఇటీవలే 70 కిలోమీటర్ల పరిధిలోని టార్గెట్లను ఛేదించగలిగిన మీడియం రేంజ్‌ సర్ఫేస్‌ టు ఎయిర్‌ మిసైల్‌(MR-SAM)ను పరీక్షించింది. ఈ సందర్భంగా గైడెడ్‌ మిసైల్‌ డెస్ట్రాయర్‌ అయిన ఐఎన్‌ఎస్‌ సూరత్‌ తొలిసారి గగనతలంలో వస్తున్న లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించిందని భారత నౌకాదళం వెల్లడించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..