Viral Video: మద్యం కిక్కులో హల్‌చల్.. లేడీ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ను రోడ్డుపై ఈడ్చుకెళ్లిన ఆటో డ్రైవర్‌! ఆ తర్వాత

సాధారణ తనిఖీల్లో భాగంగా ఓ ఆటోను లేడి ట్రాఫిక్‌ పోలీస్ ఆపేందుకు ప్రయత్నించింది. అయితే మద్యం మత్తులో ఉన్న సదరు ఆటో డ్రైవర్‌ డ్యూటీలో ఉన్న మహిళా ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ను దాదాపు 120 మీటర్లు ఈడ్చుకెళ్లాడు. ఈ షాకింగ్‌ ఘటన సతారా జిల్లాలో సోమవారం..

Viral Video: మద్యం కిక్కులో హల్‌చల్.. లేడీ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ను రోడ్డుపై ఈడ్చుకెళ్లిన ఆటో డ్రైవర్‌! ఆ తర్వాత
Woman Police Officer Dragged By Drunk Auto Driver

Updated on: Aug 19, 2025 | 7:35 PM

సతారా, ఆగస్టు 19: రోడ్డుపై వాహనాలు తనిఖీలు చేస్తున్న లేడీ ట్రాఫిక్‌ పోలీస్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఓ ఆటోను లేడి ట్రాఫిక్‌ పోలీస్ ఆపేందుకు ప్రయత్నించింది. అయితే మద్యం మత్తులో ఉన్న సదరు ఆటో డ్రైవర్‌ డ్యూటీలో ఉన్న మహిళా ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ను దాదాపు 120 మీటర్లు ఈడ్చుకెళ్లాడు. ఈ షాకింగ్‌ ఘటన మహారాష్ట్రలోని సతారా జిల్లాలో సోమవారం (ఆగస్ట్ 18) చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. వివరాల్లోకి వెళితే..

మహారాష్ట్రంలోని సతారా నగరంలోని ఓ కూడలి వద్ద సోమవారం భాగ్యశ్రీ జాదవ్ అనే లేడీ ట్రాఫిక్‌ పోలీస్‌ ఇతర సిబ్బందితోపాటు వాహనాలు తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో అటుగా వచ్చిన ఓ ఆటోని సాధారణ తనిఖీల్లో భాగంగా ఆపేందుకు యత్నించింది. ఆటోలో ఉన్న దేవరాజ్ కాలే అనే డ్రైవర్‌ మద్యం మత్తులో ఉన్నాడు. మద్యం సేవించి వాహనం నడుపుతున్నందుకు ఫైన్‌ పడుతుందనే భయంతో తప్పించుకునేందుకు ఆపకుండా ముందుకు పోనిచ్చాడు. దీంతో సదరు లేడీ కానిస్టేబుల్‌ ఆటోకు అడ్డుపడగా.. డ్రైవర్‌ ఏ మాత్రం లెక్కచేయకుండా ఆమెను ఢీకొట్టి అలాగే ఈడ్చుకుంటూ దాదాపు 120 మీటర్లు లాక్కెళ్లాడు.

ఇవి కూడా చదవండి

స్థానికులు గమనించి ఆటోను వెంబడించి ఆపి, డ్రైవర్‌ను పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. లేడీ ట్రాఫిక్ పోలీస్‌ జాదవ్‌ను కూడా రక్షించి, పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనలో మహిళా కానిస్టేబుల్‌ జాదవ్‌కు స్వల్పంగా గాయాలైనాయి. ఇందుకు సంబంధించిన సమీపంలోని సీసీకెమెరాల్లో వీడియో దృశ్యాలు రికార్డయ్యాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.