CM Kejriwal Video: ‘నేను వెళ్తున్నాను.. మళ్లీ వస్తానోరానో తెలియదు! మీరంతా జాగ్రత్త’ సీఎం కేజ్రీవాల్ వీడియో

|

May 31, 2024 | 6:49 PM

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇటీవల బెయిల్‌ మీద బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈరోజు (శుక్రవారం) ఆయన సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో రిలీజ్‌ చేశారు. జూన్ రెండో తేదీన జైలులో తాను స‌రెండ‌ర్ కానున్నట్లు ఆయన తెలిపారు. దేశాన్ని నియంతృత్వం నుంచి కాపాడేందుకు తాను మళ్లీ జైలుకు వెళ్లడం పట్ల గర్వంగా ఉందని చెప్పారు. అయినా ఢిల్లీలో తమ ప్రభుత్వ విధులు..

CM Kejriwal Video: నేను వెళ్తున్నాను.. మళ్లీ వస్తానోరానో తెలియదు! మీరంతా జాగ్రత్త సీఎం కేజ్రీవాల్ వీడియో
Delhi Chief Minister Arvind Kejriwal
Follow us on

న్యూఢిల్లీ, మే 31: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇటీవల బెయిల్‌ మీద బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈరోజు (శుక్రవారం) ఆయన సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో రిలీజ్‌ చేశారు. జూన్ రెండో తేదీన జైలులో తాను స‌రెండ‌ర్ కానున్నట్లు ఆయన తెలిపారు. దేశాన్ని నియంతృత్వం నుంచి కాపాడేందుకు తాను మళ్లీ జైలుకు వెళ్లడం పట్ల గర్వంగా ఉందని చెప్పారు. అయినా ఢిల్లీలో తమ ప్రభుత్వ విధులు ఆగవని స్పష్టం చేశారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు తాను ఇంటి నుంచి జైలుకు బయలుదేరుతానని, జైలులో తనను హింసించే అవకాశం ఉందని ఆయన వీడియోలో పేర్కొన్నారు.

రేపటితో 21 రోజుల బెయిల్‌ ముగుస్తుంది. ఆ మరుసటి రోజు తీహార్‌ జైలుకు వెళ్తున్నాను. ఈ సారి నన్ను ఎన్ని రోజులు జైలులో ఉంచుతారో తెలియదు. దేశాన్ని నియంతృత్వం నుంచి కాపాడేందుకు మళ్లీ జైలుకు వెళ్లడం గర్వంగా ఉంది. జైలులో నన్ను అనేక విధాలుగా హింసించారు. నా మందులు కూడా ఆపారు. 20 యేళ్లుగా డయాబెటిస్‌తో బాధపడుతున్నాను. జైలు నాకు ఇన్సులిన్‌ ఇంజెక్షన్‌ కూడా ఆపారు. నా షుగర్‌ లెవల్స్‌ 300-325కి చేరుకుంది. ఇన్ని రోజులు షుగర్‌ ఎక్కువగా ఉంటే కిడ్నీ, లివర్‌ పాడవుతాయి. వాళ్లంతా ఏం కోరుకుంటున్నారో.. ఎందుకు ఇదంతా చేస్తున్నారో నాకు తెలియదు. నా నోరు మూయించడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించారు. కానీ అవేమీ ఫలించలేదు. నన్ను అరెస్ట్‌ చేసినప్పుడు నా బరువు 70 కిలోలు. ఇప్పుడు 64 కిలోలున్నాను. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత నా బరువు పెరగడం లేదు. ఇది నా శరీరంలో ఇతర ఏదైనా పెద్ద వ్యాధికి సంకేతం కావచ్చని వైద్యులు అంటున్నారు. దేశాన్ని రక్షించడంలో నాకు ఏదైనా జరిగితే, ఈ పోరాటంలో నా ప్రాణాలు కూడా కోల్పోతే, బాధపడకండి. అయినా నేను లేకున్నా ఢిల్లీలో ఆప్‌ ప్రభుత్వం యథావిథిగా పనిచేస్తూనే ఉంటుంది. మీ ఉచిత విద్యుత్, మొహల్లా క్లినిక్‌లు, ఆసుపత్రులు, ఉచిత మందులు, చికిత్స, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 24 గంటల విద్యుత్ ఇతర అన్ని పనులు కొనసాగుతాయి. మ‌ళ్లీ వ‌చ్చిన తర్వాత ప్రతి మ‌హిళ‌కు రూ.వెయ్యి ఇస్తాను’ అని కేజ్రీ వీడియోలో తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింత తీవ్ర దుమారం లేపుతోంది.

ఇవి కూడా చదవండి

కాగా లిక్కర్ స్కామ్‌లో మ‌నీ ల్యాండ‌రింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీని ఈడీ అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. అయితే లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో త‌మ పార్టీ త‌ర‌పున ప్రచారం చేసేందుకు సుప్రీంకోర్టు అనుమ‌తి కోరడంతో.. ఆయ‌న‌కు 21 రోజుల తాత్కాలిక బెయిల్‌ను సుప్రీం జారీ చేసింది. ఆ బెయిల్ గ‌డువు జూన్ 1వ తేదీతో ముగియ‌నుంది. తాజాగా ఈ బెయిల్‌ను పొడిగించాల‌న్న కేజ్రీ అభ్యర్థన‌ను సుప్రీంకోర్టు రిజిస్ట్రీ స్వీక‌రించ‌లేదు. దీంతో ఆయనకు అన్ని దారులు మూసుకుపోయాయి. దేశాన్ని నియంతృత్వం నుంచి ర‌క్షించేందుకు మ‌ళ్లీ జైలుకు వెళ్ల‌నున్న‌ట్లు కేజ్రీ వెల్ల‌డించారు. మ‌ళ్లీ జైలుకు వెళ్తే త‌న‌ను ఎన్ని రోజులు బంధిస్తారో తెలియ‌ద‌న్నారు. జైలులో ఉన్నప్పుడు త‌న‌ను ఎన్నో విధాలుగా వేధించిన‌ట్లు ఆరోపించారు. త‌న‌కు మెడిసిన్ ఇవ్వ‌డం ఆపేశార‌న్నారు. జైలుకు వెళ్లేముందు త‌న బ‌రువు 70 కేజీలు అని, ఇప్పుడు 64 కేజీల‌కు చేరుకున్న‌ట్లు వెల్ల‌డించాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.