రాయ్‌పూర్, జులై 21: చిన్న కారణానికే తనువు చాలిస్తున్నారు ఈ తరం యువత. తాజాగా తండ్రి మందలించాడని ఓ యువతి 90 అడుగుల ఎత్తైన జలపాతం పై నుంచి అమాంతం నీళ్లలోకి దూకి అఘాయిత్యానికి పాల్పడింది. వివరాల్లోకెళ్తే..
ఛత్తీస్‌గఢ్ బస్తర్ జిల్లా జగదల్పూర్ నుంచి 38 కిలోమీటర్ల దూరంలో చిత్రాకోట్ జలపాతం వద్ద మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి జలపాతం చివరి దాకా వెళ్లి నిల్చుంది. కొందరు వ్యక్తులు గమనించి వెళ్లొద్దని ఆమెను వారించారు. అయినా ఆమె వినకుండా అమాంతం దూకేసింది. ఐతే ఆశ్యర్యకరంగా అంత ఎత్తు నుంచి పడ్డా ఆమెకు ఏం కాకపోవడం విశేషం. నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో రాళ్లపై పడకుండా నేరుగా నీళ్లలో పడింది. ఆమె ప్రాణాలతో ఉండటాన్ని గమనించిన స్థానికులు పడవల్లో వెళ్లి రక్షించారు. జలపాతం వద్ద కొందరు యువకులు ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది.
Watch this
Earlier in the day, a woman attempted to commit suicide by jumping into Chitrakoot waterfall of Bastar district, #Chhattisgarh. Fortunately, the woman managed to swim back to shore.#mentalhealth pic.twitter.com/qtBGMaFhnu
— Arvind Chauhan (@Arv_Ind_Chauhan) July 18, 2023
సమాచారం అందుకున్న పోలీసులు సదరు యువతికి కౌన్సిలింగ్ ఇప్పించి తల్లిదండ్రులకు అప్పగించారు. సెల్‌ఫోన్ అతిగా వాడుతున్నందుకు తండ్రి మందలించాడని, మనస్థాపంతో ఆమె ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం. కాగా చిత్రాకోట్ జలపాతం ఇంద్రావతి నదిపై ఉంది. దాదాపు 90 అడుగుల ఎత్తు నుంచి నీరు ఉధృతంగా పారుతుంటుంది. స్థానికులు దీనిని మినీ నయాగారా జలపాతంగా పిలుస్తుంటారు. ఇక్కడ ఎటువంటి భద్రతా చర్యలు లేకపోవడంతో తరచూ ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటుంటాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.