ఇంట్లోకి ఈడీ ఎంట్రీ.. భయపడి ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకిన ఎమ్మెల్యే.. తర్వాత ఏం జరిగిందో చూడండి!

తమకు ఇంటికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దర్యాప్తు కోసం వస్తున్నారని తెలిసి.. వారి నుంచి తప్పించుకోవడానికి ఒక ప్రజాప్రతినిధి ఏకంగా తన ఇంటి ఫస్ట్‌ప్లోర్‌ నుంచి బయటికి దూకి పారిపోడానికి ప్రయత్నించారు. అంతేకాకుండా పైనుంచి దూకిన వెంటనే తన దగ్గర ఉన్న ఫోన్‌ను వెంటనే డ్రైనేజ్‌లో పడేశాడు. కానీ చివరకు ఈడీ అధికారులకు దొరికిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఇంట్లోకి ఈడీ ఎంట్రీ.. భయపడి ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకిన ఎమ్మెల్యే.. తర్వాత ఏం జరిగిందో చూడండి!
Mla Jumps Video

Updated on: Aug 25, 2025 | 5:37 PM

తమకు ఇంటికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు వస్తున్నారని తెలిసి ఒక ఎమ్మెల్యే ఇంట్లోని ఫస్ట్‌ ప్లోర్‌ నుంచి దూకి పారిపోడానికి ప్రయత్నించిన ఘటన పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని ముర్షిదాబాద్ జిల్లా బుర్వాన్ అసెంబ్లీ నియోజకవర్గంలో వెలుగు చూసింది. ఈడీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, పశ్చిమ బెంగాల్‌లోని స్కూల్‌లలో ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది నియామకాల్లో జరిగిన కుంభకోణంలో బుర్వాన్ నియోజకవర్గ ఎమ్మెల్యేకి సంబంధం ఉందన్న ఆరోపణలతో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు ఈడీ అధికారులు సిద్ధమయ్యారు.

ఈ క్రమంలో ఆయన్ను అదుపులోకి తీసుకొని విచారించాలని నిర్ణయించుకున్న ఈడీ అధికారులు ఆయన నివాసానికి వెళ్లారు. అయితే తమ ఇంటికి ఈడీ అధికారులు వస్తున్నాన్న సమాచారం తెలుసుకున్న ఆ ఎమ్మెల్యే వారి నుంచి తప్పించుకోవడానికి తన ఇంటి ఫస్ట ఫ్లోర్ నుంచి దూకి పారిపోడానికి ప్రయత్నించాడు. అదిగమనించిన ఈడీ అధికారులు ఆయన్ను వెంబడించారు. పారిపోయే క్రమంలో ఆ ఎమ్మెల్యే తన దగ్గర ఉన్న ఫోన్‌ను డ్రైనేజీలో పడేశాడు. కానీ ఎట్టకేలకు ఒక వ్యవసాయం పొలం సమీపంలో ఎమ్మెల్యేను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దానితో పాటు అతని ఫోన్‌ కూడా స్వాధీనం చేసుకున్నారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది.

పాఠశాల ఉపాధ్యాయుల నియామకంలో జరిగిన అవకతవకలకు సంబంధించి ఎమ్మెల్యే సాహా, అతని బంధువులు, సహచరులు మనీలాండరింగ్‌లో పాల్గొన్నారని ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు. అయితే గతంలోనూ ఇదే కేసులో ఎమ్మెల్యే సాహాను CBI అరెస్టు చేయగా అప్పుడు ఆయనపై చర్యలు తీసుకున్నారని.. కానీ తరువాత ఆయన బెయిల్‌పై విడుదలయ్యారని ఈడీ అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.