
నది దాటుతున్న క్రమంలో ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో ట్రాక్టర్‌తో పాటు 10 మంది కూలీలు కోట్టుకుపోయిన ఘటన ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వైరల్ వీడియో ప్రకారం.. కూలీలతో వెళ్తున్న ఒక ట్రాక్టర్ ఉదృతంగా ప్రవహిస్తున్న నది దాటేందుకు ప్రయత్నించింది. కానీ అది నది మధ్యలోకి రాగానే ఆగిపోయి బ్రేక్ డైన్ అయినట్టు తెలుస్తోంది. ఎంతసేపటి ట్రాక్టర్ స్టార్ట్ కాకపోవడంతో అందులో ఉన్న కూలీలు కాపాడాలని కేకలు వేయడం ప్రారంభించారు. నది ఒడ్డున ఉన్న కొందరు స్థానికులు వారిని గమనించారు.కానీ అంతలోనే నది ప్రవాహం పెరగడంతో ట్రాక్టర్‌తో అందులో ఉన్న 10 మంది కూలీలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు.
అయితే ఒడ్డున్న ఉన్న స్థానికులు చేసేదేమి లేక నదిలో కొట్టుకుపోతున్న వారిని అలానే చూస్తు ఉండిపోయారు. ఎవరైనా వారిని కాపాడండి అంటే కేకలు వేశారు. అయితే నది ప్రవాహం ఎక్కువగా ఉండడంతో వారంతో చనిపోయి ఉండవచ్చని గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు బాధిత కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు.
ఇదిలా ఉండగా రాత్రంతా కురుస్తున్న భారీ వర్షానికి డెహ్రాడూన్, ముస్సోరీ, మాల్ దేవతా ప్రాంతాల్లో రోడ్లు, ఇళ్లు భారీగా దెబ్బతిన్నాయి. డెహ్రాడూన్ ప్రేమ్ నగర్‌లోని లా కాలేజీ సమీపంలోని వంతెన కొట్టుకుపోయింది. సహాయక బృందాలు రంగంలోకి దిగి దాదాపు 400 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
భారీ వర్షం కారణంగా రాష్ట్రంలోని అన్ని నదులు పొంగిపొర్లుతున్నాయని సీఎం పుష్కర్ సింగ్ ధామి అన్నారు. “25 నుండి 30 చోట్ల రోడ్లు తెగిపోయాయి. అప్రోచ్ రోడ్లు తెగిపోయాయి. ఇళ్ళు, ప్రభుత్వ ఆస్తులు దెబ్బతిన్నాయి. సాధారణ జనజీవనం తీవ్రంగా ప్రభావితమైంది. సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి రెస్క్యూ బృందాలు యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నాయి” అని ఆయన అన్నారు. “రాష్ట్ర ప్రభుత్వం ప్రతి బాధిత కుటుంబానికి అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.
వీడియో చూడండి..
वीडियो विकासनगर के टॉस नदी का बताया जा रहा। जहां टॉस नदी के तेज बहाव में एक ट्रैक्टर-ट्रॉली बह गया। ट्रॉली में करीब 10 मजदूर सवार थे, जो नदी किनारे खनन कार्य के लिए जा रहे थे। अचानक पानी का तेज बहाव आने से ट्रैक्टर-ट्रॉली बह गई, और उसमें सवार सभी लोग नदी के बहाव में बहते नजर आए। pic.twitter.com/P531EpmLnM
— bhUpi Panwar (@askbhupi) September 16, 2025
⛈️ #FWR Ops | Dehradun (UKD) | 16 Sep
🔸1 child trapped in the flooded midstream of Swarna River at Tharkurpur, Premnagar
🔸NDRF conducted #FWR Ops and rescued the child safely; PHT provided
🔸People in flood-prone areas are advised to stay alert & follow safety guidelines pic.twitter.com/oMCmtawmXz
— NDRF India I राष्ट्रीय आपदा मोचन बल (@NDRFHQ) September 16, 2025
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.