AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోలీసులకు చిక్కిన అవినీతి తిమింగలం.. ఇంటి నిండా నోట్ల గుట్టలే..

అవినీతి ఆరోపణలతో అసోంలోని ఓ ఉన్నాతాధికారి ఇంట్లో సోదాలు చేస్తే.. ఏకంగా రెండు బ్యాగుల నిండా ఉన్న నోట్ల కట్టలు, బంగారం కనిపించాయి. అవినీతి తిమింగలం పోలీసులకు చిక్కిన ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం రేపుతోంది. అవినీతి ఆరోపణలతో ACS అధికారి నూపుర్ బోరా ఇంట్లో సీఎం స్పెషల్ విజిలెన్స్ సెల్ అధికారులు సోదాలు నిర్వహించారు.

పోలీసులకు చిక్కిన అవినీతి తిమింగలం.. ఇంటి నిండా నోట్ల గుట్టలే..
Assam Crime
Shaik Madar Saheb
|

Updated on: Sep 16, 2025 | 2:01 PM

Share

అవినీతి ఆరోపణలతో అసోంలోని ఓ ఉన్నాతాధికారి ఇంట్లో సోదాలు చేస్తే.. ఏకంగా రెండు బ్యాగుల నిండా ఉన్న నోట్ల కట్టలు, బంగారం కనిపించాయి. అవినీతి తిమింగలం పోలీసులకు చిక్కిన ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం రేపుతోంది. అవినీతి ఆరోపణలతో ACS అధికారి నూపుర్ బోరా ఇంట్లో సీఎం స్పెషల్ విజిలెన్స్ సెల్ అధికారులు సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. బ్యాగుల నిండా నోట్ల కట్టలు, బంగారం, వజ్రాలు దొరికాయి.. రూ.90లక్షల నగదు, కోటి విలువైన బంగారం సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. అనంతరం ACS అధికారి నూపుర్ బోరాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భూ కుంభకోణం, ఆదాయానికి మించి ఆస్తులపై ఆరా తీస్తున్నారు. 2019లో అస్సాం సివిల్‌ సర్వీసెస్‌లో చేరిన నూపుర్‌ బోరా.. ప్రస్తుతం కామ్రూప్‌ జిల్లాలోని గోరోయిమారిలో సర్కిల్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు.

బార్పేట్‌ జిల్లాలో సర్కిల్‌ ఆఫీసర్‌గా ఉన్నప్పుడు డబ్బుకు బదులుగా భూమిని లంచంగా తీసుకున్నట్లు తేలడంతో గత ఆరు నెలలుగా ఆమెపై నిఘా ఉంచారు పోలీసులు. అలాగే బార్పేట్‌లో ఆమెకుతో కలిసి పనిచేసిన లాట్‌ మండల్‌ సురాజిత్‌ డేకా నివాసంలో కూడా అధికారులు సోదాలు చేశారు. ఇతడిపై కూడా భూ కుంభకోణం ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతుండగా.. పోలీసులు ఆమెను విచారిస్తున్నారు.. దాదాపు రూ.2 కోట్ల వరకు సీజ్ చేసినట్లు చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మీ ఎత్తుకు తగ్గట్టు ఎంత బరువు ఉండాలో తెలుసా? నిపుణుల సూచన
మీ ఎత్తుకు తగ్గట్టు ఎంత బరువు ఉండాలో తెలుసా? నిపుణుల సూచన
విజయవాడలో పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్..
విజయవాడలో పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్..
పెద్ది నిర్మాతల కఠిన చర్యలు:ట్రోల్స్,ఫేక్ అకౌంట్స్,పైరసీపై యుద్ధం
పెద్ది నిర్మాతల కఠిన చర్యలు:ట్రోల్స్,ఫేక్ అకౌంట్స్,పైరసీపై యుద్ధం
IPL 2026: గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లకు తప్పిన ఘోర ప్రమాదం..
IPL 2026: గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లకు తప్పిన ఘోర ప్రమాదం..
బిగ్‌ అలర్ట్‌.. జూన్ 1 నుండి ఈ నిబంధనలు మారాయని మీకు తెలుసా..?
బిగ్‌ అలర్ట్‌.. జూన్ 1 నుండి ఈ నిబంధనలు మారాయని మీకు తెలుసా..?
ఐపీఎల్ విజేతపై కాసుల వర్షం.. GTతోపాటు SRHకు ఎంత దక్కాయంటే?
ఐపీఎల్ విజేతపై కాసుల వర్షం.. GTతోపాటు SRHకు ఎంత దక్కాయంటే?
పెళ్లయ్యాక అమ్మాయిలు ఎందుకు లావు అవుతారు? బరువు పెరగడానికి గల ప్ర
పెళ్లయ్యాక అమ్మాయిలు ఎందుకు లావు అవుతారు? బరువు పెరగడానికి గల ప్ర
ఏడాది తర్వాత ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా..
ఏడాది తర్వాత ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా..
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 ఫలితాలు విడుదల.. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 ఫలితాలు విడుదల.. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్
రెండోసారి ట్రోఫీని ముద్దాడిన ఆర్సీబీ.. కోహ్లీ సెలబ్రేషన్స్ చూశారా
రెండోసారి ట్రోఫీని ముద్దాడిన ఆర్సీబీ.. కోహ్లీ సెలబ్రేషన్స్ చూశారా