మీరు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మోసాల గురించిన వార్తలు మీరు అనేకం చూసే ఉంటారు. మోసం చేసి డబ్బు సంపాదించడానికి ప్రజలు ఏ స్థాయికైనా దిగజారుతున్నారు కేటుగాళ్లు. డబ్బు సంపాదించడానికి ఎవరూ ఊహించలేని పనులు చేస్తారు. అలాంటి షాకింగ్ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ వీడియోలో వెలుగులోకి వచ్చింది. కొన్ని ముఠాలు ఇప్పుడు కదులుతున్న కార్ల ముందుకు దూకి, కారు ఢీకొన్నట్లు నటిస్తూ ప్రజలను ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. అలాంటి ఘటనే కారు డాష్‌బోర్డ్ కెమెరాలో చిక్కుకుంది .
అసలు ఏం జరిగింది?
డ్రైవర్‌ను ట్రాప్ చేసేందుకు ఓ వ్యక్తి కారు ముందుకొచ్చిపడ్డాడు. కారు అతన్ని ఢీకొట్టినట్టుగా నటించాడు. పరిహారం పేరుతో డబ్బులు వసూలు చేయాలన్నది ఆ వ్యక్తి పథకం. ఇదంతా డాష్‌క్యామ్‌లో రికార్డయిందని ఆ వీడియోను కారు యజమాని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో దక్షిణ భారతదేశంలోని జాతీయ రహదారిపై జరిగిన ఘటనగా తెలిసింది. వీడియోలోని రోడ్లు, పరిసర ప్రాంతాల కూడా గమనించవచ్చు. షేర్ చేసిన వీడియోలో ఎడమ వైపు నుండి ఒక వ్యక్తి కారు ముందుకు పరిగెత్తాడు. బానెట్‌పై దూకాడు. ఆ వ్యక్తి ఈ చర్యకు పాల్పడే ముందు కారును చాలా దూరం నుంచి చూస్తున్నట్లు తెలుస్తోంది. కారు సమీపిస్తుండగా ఈ వ్యక్తి వేగంగా పరిగెడుతూ కారు బానెట్‌పైకి దూసుకెళ్లాడు. ఈ చర్య వ్యక్తిని కారు ఢీకొట్టినట్లు చూపించే ప్రయత్నాన్ని చూపిస్తుంది.
ఎదురుగా ఏం జరిగిందో చూసి కారులో కూర్చున్న కుటుంబసభ్యులు భయాందోళనకు గురయ్యారు. కానీ వారి కారులో డాష్‌క్యామ్ ఉందని, ప్రతిదీ రికార్డ్ చేయబడిందని డ్రైవర్ సదరు వ్యక్తిని హెచ్చరించాడు. కానీ, అతడు వారి మాట లెక్కచేయకుండా డబ్బు ఆశతో బెదిరింపులకు దిగాడు. కానీ, కారులో నిజంగా కెమెరా ఉందని తెలిసి.. సదరు కేటుగాడు అక్కడ్నుంచి పరారయ్యాడు. డ్యాష్‌క్యామ్ కలిగి ఉండటం వల్ల ఎన్ని ప్రయోజనాలో కదా అనే శీర్షికతో వీడియో షేర్ చేయబడింది. ఈ వీడియో మిలియన్ల కొద్దీ వీక్షణలను పొందింది. వీడియో కింద కారులో డ్యాష్‌బోర్డ్ కెమెరా ఉండటం నిజంగా ప్రయోజనకరమని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Little perks of having a Dashcam!
Video shared in my car owners group! pic.twitter.com/2sED8qy1uv
— Agent Peenya (@Themangofellow) February 17, 2023
మోసగాళ్లకు గుణపాఠం చెప్పేందుకు, ప్రమాద పరిస్థితుల్లో సరిగ్గా ఏం జరిగిందనే సమాచారాన్ని తెలుసుకునేందుకు డాష్‌క్యామ్‌లు ఎంతగానో ఉపయోగపడతాయని పలువురు అంటున్నారు. పాశ్చాత్య దేశాలలో డాష్‌క్యామ్‌లను చాలా సాధారణంగా ఉపయోగిస్తున్నప్పటికీ, భారతదేశంలో డాష్‌క్యామ్ వినియోగదారుల సంఖ్య చాలా తక్కువ.
మరిన్ని జాతీయ వార్తల కోసం ..