Watch: బెంబేలెత్తిస్తున్న వరుస రైలు ప్రమాదాలు.. పట్టాలు తప్పిన మరో ట్రైన్‌.. ఎక్కడంటే..

ఈ ప్రమాదంతో ఆ మార్గంలో ప్రయాణించే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఘటనా స్ధలానికి చేరుకున్న అధికారులు సహాయ చర్యలు పర్యవేక్షిస్తున్నారు. వల్సాద్‌లో కురుస్తున్న వర్షం కారణంగా సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడింది. ప్రమాదానికి గల కారణాలతో పాటు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రాధమిక దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు వెల్లడవుతాయని అధికారులు చెబుతున్నారు.

Watch: బెంబేలెత్తిస్తున్న వరుస రైలు ప్రమాదాలు.. పట్టాలు తప్పిన మరో ట్రైన్‌.. ఎక్కడంటే..
Wagon of Goods Train Derails In Valsad

Updated on: Jul 19, 2024 | 9:13 PM

Rail Accident : వరుస రైలు ప్రమాదాలు ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. అధికార యంత్రాంగం పని తీరుపై ప్రజల్లో అసహనం కలిగేలా చేస్తున్నాయి. యూపీలో ఇటీవలి రైలు ప్రమాద ఘటన మరువకముందే గుజరాత్‌లో మరో ప్రమాదం చోటుచేసుకుంది. వల్సాద్‌లో శుక్రవారం సాయంత్రం గూడ్స్‌ ట్రైన్‌ వ్యాగన్‌ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంతో ఆ మార్గంలో ప్రయాణించే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఘటనా స్ధలానికి చేరుకున్న అధికారులు సహాయ చర్యలు పర్యవేక్షిస్తున్నారు.

వల్సాద్‌లో కురుస్తున్న వర్షం కారణంగా సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడింది. ప్రమాదానికి గల కారణాలతో పాటు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రాధమిక దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు వెల్లడవుతాయని అధికారులు చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..