Viral Video: రోడ్డుపై ఆగివున్న ఆయిల్‌ ట్యాంకర్‌ను ఢీ కొట్టిన బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

|

Mar 20, 2025 | 10:05 AM

ఆయిల్‌ నింపుకుని వెళ్తున్న ఆయిల్‌ ట్యాంకర్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై ఓ చోట ఆగి వుంది. ఇంతలో అటుగా వచ్చిన ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులోని ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా.. ఆయిల్ ట్యాంకర్‌ డ్యామేజ్‌ అయ్యి ఆయిల్‌ రోడ్డుపై ఏరులై పారసాగింది. గమనించిన స్థానికులు బిందెలు, బకెట్లు, డబ్బాలతో ఒక్కసారిగా ఎగబడ్డారు..

Viral Video: రోడ్డుపై ఆగివున్న ఆయిల్‌ ట్యాంకర్‌ను ఢీ కొట్టిన బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Villagers Loot Rice Bran Oil From Tanker
Follow us on

లక్నో, మార్చి 20: ఆగ్రాలోని ఫతేహాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై రైస్ బ్రాన్ ఆయిల్‌తో వెళ్తున్న ట్యాంకర్‌ను ప్యాసింజర్ బస్సు బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సులోని ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే మరోవైపు ఆయిల్‌ ట్యాంకర్‌ కూడా దెబ్బతినడంతో లీకై నూనె రోడ్డుపై ఏరులై పారసాగింది. గమనించిన స్థానికులు బకెట్లు, బిందెలతో ఆయిల్‌ ట్యాంకర్‌ వద్దకు పరుగులు తీశారు. ఎగబడి మరీ ఆయిల్‌ను పట్టుకునేందుకు గుమి కూడారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రక్కు దగ్గర 50 మందికి పైగా జనాలు బకెట్లు, బాటిళ్లతో నూనెను పట్టుకునేందుకు ట్యాంకర్‌ వద్ద గుమికూడి ఉండటం వీడియోలో కనిపిస్తోంది.

ఉత్తరప్రదేశ్‌లోని ఫతేహాబాద్‌లో బుధవారం ఉదయం 7.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. లక్నో నుంచి ఆగ్రా వైపు ప్రయాణికులతో వెళ్తున్న బస్సు, ఆయిల్ ట్యాంకర్‌ను ఢీ కొట్టింది. దీంతో నూనెను సేకరించేందుకు స్థానికులు బకెట్లు, బాటిళ్లు, బిందెలతో ఎగబడ్డారు. దీంతో బస్సులోని ప్రయాణికుల్లో కొందరు గాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికులను చెదరగొట్టేందుకు లాఠీ చార్జ్ చేయవల్సి వచ్చింది. అనంతరం గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. దెబ్బతిన్న ట్యాంకర్‌ను కూడా సంఘటన స్థలం నుండి తొలగించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.